Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni: కొత్త జంటకు షాకిచ్చిన ధోనీ.. కామెడీ టైమింగ్ సూపర్ (Video)

టీమిండియా మాజీ కెప్టెన్, ప్రపంచకప్ విజేత మహేంద్ర సింగ్ ధోనీ బయట కార్యక్రమాల్లో చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. అయితే మాట్లాడిన కొన్ని సందర్భాల్లోనూ వాటి భావాలు లోతుగా ఉంటాయి. ఒత్తిడిని ఎదుర్కోవడానికి, ప్రతికూల పరిస్థితుల్లో సత్తాచాటడానికి ధోనీ చెప్పిన మాటలు ఎంతో మందికి ప్రేరణగా నిలిచాయి.

అయితే స్ఫూర్తిని ఇచ్చే మాటలే కాకుండా కామెడీ టైమింగ్‌లోనూ ధోనీ ప్రత్యేకంగా నిలుస్తాడు. ముఖ్యంగా పెళ్లి విషయాల్లో ధోనీ చాలా సరదాగా మాట్లాడుతుంటాడు. భార్య స్థానాన్ని కొనియాడుతూనే వ్యంగ్యంగా పంచ్‌లు విసురుతుంటాడు. 'మన (భర్త) ప్రకారమే అన్నీ చేస్తున్నామనకుంటాం. కానీ, చేయించేది మాత్రం భార్యలే, కంట్రోల్ చేసేది వారే' అని గతంలో ధోనీ చెప్పిన మాటలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి.

MS Dhoni shocked the Rishabh pants sister with his Comedy timing. video goes viral

అయితే తాజాగా పెళ్లి గురించి ధోనీ మరోసారి సరదాగా మాట్లాడాడు. రిషభ్ పంత్ సోదరి సాక్షి పంత్ నిశ్చితార్థం వేడుకకు వెళ్లిన ధోనీ స్టేజ్‌పై మాట్లాడాడు. ''వారిద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలా బాగా డ్యాన్స్ కూడా వేశారు. వారు చాలా బాగా కలిసిపోతారు. అయితే రాబోయే సవాలు సమయాల్లో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సవాలు అంటే కెరీర్ గురించి'' అని ధోనీ చమత్కరించాడు. ధోనీ చెప్పిన మాటలతో అక్కడ ఉన్న అందరూ నవ్వేశారు.

కాగా, టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ సోదరి సాక్షి నిశ్చితార్థం శుక్రవారం ఘనంగా జరిగింది. గత తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉన్నఅంకిత్ చౌదరీతో సాక్షి పెళ్లి పీటలక్కెనుంది. తమ లవ్ స్టోరీలో మరో కొత్త ఛాప్టర్ మొదలైందని సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. సాక్షి, అంకిత్ లండన్‌లో నివసిస్తున్నారు. అమిటీ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన అంకిత్ లండన్‌కి వెళ్లి స్థిరపడ్డాడు. మరోవైపు పంత్ కూడా ఎంగేజ్‌మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. సోదరికి శుభాకాంక్షలు తెలిపాడు.

కాగా, హుక్కాను పీలుస్తూ ధోనీ ఇటీవల వార్తలకెక్కిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా క్రమశిక్షణతో హుందాగా ఉండే ధోనీ స్మోకింగ్ చేసే వీడియో బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే అది యాడ్ షూటింగ్‌లో భాగంగా ధోనీ చేశాడని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు అది ప్రైవేట్ పార్టీ వీడియో అంటున్నారు. 42 ఏళ్ల ధోనీ గతేడాది మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం మరో కొన్ని రోజుల్లో ధోనీ నెట్స్‌లో సాధన మొదలుపెట్టనున్నాడు.

Story first published: Monday, January 8, 2024, 15:50 [IST]
Other articles published on Jan 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+