న్యూఢిల్లీ: భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ముద్దుల కూతురు జీవాకు సంబంధించిన కొన్ని కొత్త ఫొటోలను గురువారం షేర్ చేశాడు. ఇటీవలే టెస్ట్ క్రికెట్ నుంచి రిటైరైన ధోనీ.. తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో జీవా ఫొటోలను పోస్ట్ చేశాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచుల సందర్భంగా జీవా తరచూ ధోనీ, సాక్షిలతోపాటు కనిపించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ కప్ టోర్నీకి వారం ముందే (ఫిబ్రవరిలో) జీవాకు తండ్రి అయ్యాడు.

జీవా వచ్చిన తర్వాత తన జీవితం మారిపోయిందని ఇటీవల ధోనీ ప్రకటించాడు. చిన్నారుల నవ్వే మనకు ఎంతో ఆనందాన్నిస్తుందని చెప్పాడు.

చిన్నారి జీవాకు ఎలాంటి విషయాలతో సంబంధం లేదని, ఏడవాలనుకుంటే ఏడుస్తుందని.. నవ్వాలనుకుంటే నవ్వుతుందని తెలిపాడు.