For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మంచు కొండల్లో పాట పాడిన జీవా.. ఫిదా అయిన ధోనీ!!

MS Dhoni shares adorable video of Ziva playing guitar and singing in snowy weather

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గతేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ అనంతరం క్రికెట్ ఆటకు దూరంగా ఉన్నాడు. అప్పటినుండి ధోనీ తన భార్య సాక్షి, కూతురు జీవాలతో కలిసి స్వదేశంలో, విదేశాల్లో చక్కర్లు కొడుతూ సరదా సమయం గడుపుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తన కుటుంబంలో కలిసి మంచు కొండల్లో విహరించాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

జీవా గిటార్ వాయిస్తూ.. ఈక్వెస్ట్రియా ల్యాండ్‌ ఆఫ్‌ లవ్‌ సాంగ్‌ పాడిన వీడియోను ధోనీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. 'మంచు జీవాలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తెచ్చింది' అని వీడియోకి క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ వీడియోకు పోస్ట్ చేసిన కొద్దిక్షణాల్లోనే దాదాపు 10 లక్షల లైకులు వచ్చాయి. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా డెహ్రాడూన్‌లోని హిల్‌స్టేషన్‌లో మంచు కురుస్తుండగా.. ధోనీ తన కూతురు జీవాతో కలిసి సందడి చేశాడు. తండ్రితో పాటు జీవా కూడా స్నో మ్యాన్‌ను తయారు చేసింది. ధోనీ, జీవా కలిసి బుల్లి మంచు మనిషిని రూపొందిస్తుండగా.. తీసిన వీడియోను మహీ భార్య సాక్షి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఆ వీడియో కూడా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

View this post on Instagram

Snow brings the best out of her @ziva_singh_dhoni

A post shared by M S Dhoni (@mahi7781) on

ప్రపంచకప్‌ అనంతరం ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత ఆర్మీకి సేవలందించాలని మొదటగా వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యాడు. ఆ తర్వాత స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌ సిరీస్‌లకు అందుబాటులో లేడు. ఇక ఈ సంవత్సరం జరిగే శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్‌లలో కూడా లేదు. ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ధోనీ తిరిగి జట్టులోకి వస్తాడని సమాచారం తెలుస్తోంది. అయితే మెగాటోర్నీలో ఆడాలంటే.. ఐపీఎల్‌లో రాణించాల్సి ఉంటుందని టీమిండియా కోచ్ రవిశాస్త్రి అన్నాడు.

Story first published: Monday, January 6, 2020, 14:07 [IST]
Other articles published on Jan 6, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+