Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

త్రోబాక్ వీడియో.. సాక్షిని టీజ్‌ చేసిన ధోనీ!!

MS Dhoni Shares A Throwback Video Of Wife, Sakshi As He Makes Fun Of Her Dialogue Delivery Skills

రాంచీ: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సోమవారం తన భార్య సాక్షి ధోనీకి సంబందించిన ఓ త్రోబాక్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఏడాది క్రితం ఓ యాడ్‌ షూట్‌లో భాగంగా తీసిన వీడియో అది. ఇందులో సాక్షిని 38 ఏళ్ల జార్ఖండ్ వికెట్ కీపర్ ధోనీ టీజ్‌ చేయగా.. ఆమె సరదాగా నవ్వుకుంది.

సాక్షిని టీజ్‌ చేసిన ధోనీ:

సాక్షిని టీజ్‌ చేసిన ధోనీ:

ధోనీ పోస్టు చేసిన వీడియోలో సాక్షి ఓ పెట్రోల్ బంకులో కూర్చొని ఉంది. ఒక పేపర్‌ మీదున్న డైలాగ్‌ను సాక్షి ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించారు. అయితే ఆ డైలాగ్‌ను సరిగ్గా పలకలేకపోయిన సాక్షిని చూసి ధోనీ సరదాగా ఆటపట్టించాడు. 'పేపర్‌ మీదున్న డైలాగే చదవలేకపోతున్నావు, ఇక కెమెరా ముందు ఎలా పలుకుతావు. ఒకే టేక్‌లో చెప్పాల్సిన డైలాగ్‌ను చెప్పలేకపోతున్నావు' ధోనీ జోక్‌ చేశాడు. అయితే సాక్షి మాత్రం నవ్వులు పూయించింది.

 ధోనీ సూపర్:

ధోనీ సూపర్:

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన నెటిజన్లు తెగ లైకులు, కామెంట్లు చేస్తున్నారు. 'ధోనీ సూపర్' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'బాగా ఆటపట్టించాడు' అని మరో నెటిజన్ కామెంట్ చేసాడు. జూలై 4, 2010న ధోనీ-సాక్షి ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లిచేసుకున్నారు. వీరికి జీవా అనే కుమార్తె ఉంది.

తాత్కాలిక విరామం:

తాత్కాలిక విరామం:

ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వరల్డ్‌కప్ తర్వాత తొలుత భారత ఆర్మీకి సేవలందించేందుకు గాను ధోనీ విండిస్ పర్యటనకు దూరమయ్యాడు. ఆ తర్వాత సొంతగడ్డపై జరిగిన దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్‌లకు అందుబాటులో లేడు. ప్రస్తుతం వెస్టిండిస్‌తో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరిస్‌కు కూడా దూరమయ్యాడు. వచ్చే ఏడాది న్యూజిలాండ్‌తో జరిగే సిరిస్‌కు ధోనీ ఎంపికయ్యే అవకాశాలున్నాయి.

జనవరి వరకు ఆగండి:

ధోనీ రీఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. మహీ టీమిండియాలో తిరిగి ఆడడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని ప్రశ్నించగా.. 'ఆ విషయం ధోనీనే అడగండి' అని సూచించారు. ఇక ధోనీని అడగ్గా.. 'జనవరి వరకు ఆగండి' అని స్పష్టం చేశాడు. ధోనీ జాతీయ జట్టులోకి తిరిగి రావాలనుకున్నప్పుడు అతడు దేశవాళీ క్రికెట్‌ ఆడితే బాగుంటుందని మాజీ క్రికెటర్ మదన్‌లాల్ అభిప్రాయపడ్డాడు.

Story first published: Tuesday, December 17, 2019, 10:22 [IST]
Other articles published on Dec 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+