Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అలెన్ బోర్డర్‌కు షాక్: వన్డే కెప్టెన్‌గా ధోని ఖాతాలో మరో రికార్డు

ధర్మశాల: భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలనందించిన వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో మైలు రాయిని తన ఖాతాలో వేసుకున్నాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఆదివారం ధర్మశాలలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు

భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు

ఈ విజయం ధోని నేతృత్వంలోని టీమిండియాకు 108వ వన్డే విజయం కావడం గమనార్హం. ఈ విజయంతో ధోని వన్డే క్రికెట్‌లో జట్టుకు మరిన్ని విజయాలను అందించిన కెప్టెన్లలో రెండోవాడిగా రికార్డు నమోదు చేశాడు. మొట్టమొదటి స్థానంలో ఆస్ట్రేలియాకు రెండు సార్లు వరల్డ్ కప్ సాధించిన రికీ పాంటింగ్ ఉన్నాడు.

ధోని ఖాతాలో మరో మైలురాయి

ధోని ఖాతాలో మరో మైలురాయి

రీకీ పాంటింగ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు 230 వన్డే మ్యాచ్‌లు ఆడగా, అందులో 165 మ్యాచ్‌లు నెగ్గింది. కేవలం 51 వన్డేల్లో మాత్రమే ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. ప్రపంచ వన్డే క్రికెట్‌లో గెలుపు శాతం ఎక్కువగా ఉన్న కెప్టెన్లలో రికీ పాంటింగ్ ప్రథమ స్థానంలో ఉన్నాడు.

పాంటింగ్ తర్వాత రెండో ఆటగాడిగా ధోని

పాంటింగ్ తర్వాత రెండో ఆటగాడిగా ధోని

పాంటింగ్ గెలుపు శాతం 76.14గా ఉంది. ఆ తర్వాత స్ధానంలో టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. 2007-2016 (ఇంకా కెప్టెన్‌గా ధోని కొనసాగుతున్నారు) మధ్య కాలంలో భారత్ తరుపున 196 వన్డే మ్యాచ్‌లకు ధోని ప్రాతినిధ్యం వహించాడు.

మూడో స్థానంలో అలెన్ బోర్డర్

మూడో స్థానంలో అలెన్ బోర్డర్

అందులో టీమిండియా 108 మ్యాచ్‌లు నెగ్గగా, 72 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఇక మూడో స్ధానంలో ఆస్ట్రేలియాకు చెందిన మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ ఉన్నారు. 1985 నుంచి 1994 మధ్య కాలంలో ఆస్ట్రేలియా వన్డే జట్టుకు అలెన్ బోర్డర్ కెప్టెన్‌గా వ్యవహరించారు. బోర్డర్ నేతృత్వంలో ఆస్ట్రేలియా 178 మ్యాచ్‌లు ఆడగా, అందులో 107 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, కేవలం 67 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమి పాలైంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+