For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs RCB: చరిత్ర సృష్టించే దిశగా కెప్టెన్ కూల్!

CSK vs RCB: నేడు(శనివారం) చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. సీఎస్కే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించగా.. ఆర్సీబీ ప్లేఆఫ్ రేసులో కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మూడో స్థానంలో ఉంది. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి ఈ మ్యాచ్ చాలా ముఖ్యం. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన ఖ్యాతిని కాపాడుకునేందుకు ఈ మ్యాచ్ ఆడుతుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోని తన పేరు మీద కీలక రికార్డును సృష్టించగలడు. ఎంఎస్ ధోని ఆ రికార్డును సాధించడానికి కేవలం ఒక సిక్స్ దూరంలో ఉన్నాడు.

చరిత్ర సృష్టించే దిశగా ఎంఎస్ ధోని
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)పై ఎంఎస్ ధోనికి గొప్ప రికార్డు ఉంది. ఎంఎస్ ధోని ఇప్పటివరకు ఆర్సీబీతో 34 మ్యాచ్‌లు ఆడి 40.64 సగటుతో 894 పరుగులు చేశాడు. ఈ కాలంలో ఎంఎస్ ధోని నాలుగు అర్థ సెంచరీలు సాధించాడు. ధోని ఆర్సీబీ జట్టుపై ఇప్పటివరకు 49 సిక్సర్లు కొట్టాడు. ఇవాళ జరిగే మ్యాచ్‌లో ధోని మరో సిక్స్ కొడితే ఆర్సీబీపై ఐపీఎల్‌లో 50 సిక్సర్లు బాదిన తొలి భారతీయ ఆటగాడిగా ధోని నిలవనున్నాడు. ఇప్పటివరకు ఆర్సీబీపై డేవిడ్ వార్నర్ 55 సిక్స్‌లు కొట్టి అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఎంఎస్ ధోని 49 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

MS Dhoni Set to Create History Against RCB in IPL 2025 Clash

ఐపీఎల్‌లో ఆర్సీబీపై అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే..
డేవిడ్ వార్నర్-55 సిక్సర్లు
ఎంఎస్ ధోని - 49 సిక్సర్లు
కేఎల్ రాహుల్ - 43 సిక్సర్లు
ఆండ్రీ రస్సెల్ - 38 సిక్సర్లు
రోహిత్ శర్మ - 38 సిక్సర్లు

మరోవైపు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కూడో ఎంఎస్ ధోని ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఎంఎస్ ధోని ఇక్కడ 13 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 81.50 సగటుతో 489 పరుగులు చేశాడు. ఈ స్టేడియంలో ధోని మరో 11 పరుగులు చేస్తే ఇక్కడ 500 పరుగులు పూర్తి చేసిన మరో ఆటగాడిగా నిలుస్తాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఎంఎస్ ధోని పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఎంఎస్ ధోని ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 25.17 సగటుతో 151 పరుగులు చేశాడు. అయితే ఇప్పటివరకు ధోని బ్యాట్ నుంచి అర్థ సెంచరీ కూడా రాలేదు. ధోని 148.04 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఎంఎస్ ధోని 12 ఫోర్లతో పాటు 9 సిక్సర్లు కూడా కొట్టాడు.

Story first published: Saturday, May 3, 2025, 17:21 [IST]
Other articles published on May 3, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+