
పానీపూరి తయారు చేసిన ధోనీ:
తాజాగా ఎంఎస్ ధోనీ మాల్దీవుల పర్యటనకు వెళ్ళాడు. మాల్దీవులలోని ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ధోనీ, మాజీ క్రికెటర్లు ఆర్పీ సింగ్, పీయూష్ చావ్లాలు ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడే మహీ తనలోని పాకశాస్త్ర నిపుణుడిని నిద్రలేపాడు. ఓ పానీపూరి స్టాల్ దగ్గర నిలబడిన మహీ.. అక్కడున్న అన్ని పాదార్థాలను తీసుకుని పానీపూరిని తయారు చేసాడు. వాటిని సహచర క్రికెటర్లు ఆర్పీ సింగ్, పీయూష్ చావ్లాలకు అందించాడు. వెంటనే ఆర్పీ సింగ్ ధోనీకి కృతజ్ఞతలు తెలిపాడు.

మల్టీటాలెంటెడ్ మ్యాన్ మహీ:
ధోనీ పానీపూరి తయారు చేసిన విధానాన్ని 'ఎంఎస్ ధోనీ ఫాన్స్ ఆఫిషల్' ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. 'మాల్దీవుల్లో మా రాక్‌స్టార్ పానీ పూరిస్ తయారుచేస్తున్నాడు' అని కాప్షన్ రాసారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరలైంది. అభిమానులు ఫన్నీ కామెంట్లు, లైకుల వర్షం కురిపిస్తున్నారు. 'మల్టీటాలెంటెడ్ మ్యాన్ మహీ' అని ఒక అభిమాని వీడియోకు ట్వీట్ చేశాడు. 'ఈ ప్రపంచంలో నాకు చాలా ఇష్టమైనవి మహీ మరియు పానీపూరి' అని ఓ అభిమాని కామెంట్ చేసాడు.

కాంట్రాక్ట్ లిస్టులో దక్కని చోటు:
తాజాగా బీసీసీఐ 2019 అక్టోబర్ నుంచి 2020 సెప్టెంబర్ వరకూ ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించగా.. అందులో ధోనీకి కాంట్రాక్ట్ ఇవ్వలేదు. దీంతో మహీ మళ్లీ భారత్ జట్టు తరఫున ఆడటం అనుమానమేనంటూ వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ తనను కాంట్రాక్ట్ జాబాతా నుంచి తప్పించిన రోజే ధోనీ ఝార్ఖండ్ రంజీ జట్టుతో కలిసి మైదానంలో ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. దీంతో ఐపీఎల్-2020కి సన్నద్ధం అవుతున్న విషయాన్ని మహీ చెప్పకనే చెప్పేశాడు.

2021 ఐపీఎల్ ఆడుతాడు:
మహీ టీమిండియాకు ఆడినా ఆడకపోయినా.. ఈ ఏడాడితో పాటు వచ్చే ఏడాది కూడా ఐపీఎల్ ఆడనున్నాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్ శ్రీనివాసన్ ఇదివరకే స్పష్టం చేసారు. 'ధోనీ 2020 ఐపీఎల్ ఆడుతాడు. 2020 ఐపీఎల్‌తో పాటు 20021 ఐపీఎల్‌లో కూడా ధోనీ తమ జట్టు తరఫున బరిలోకి దిగుతాడు. వచ్చే ఏడాది మహీ వేలంలో ఉన్నా.. మేమే తీసుకుంటాం. ధోనీపై నమ్మకం ఉంది, వచ్చే రెండు ఐపీఎల్ సీజన్లలో ధోనీ నేతృత్వంలోనే బరిలోకి దిగుతాం' అని శ్రీనివాసన్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications












