సిడ్నీ: భోజన ప్రియుడైన భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రుచికరమైన ఆహారం కోసం ఆస్ట్రేలియా హోటళ్లన్నీ తిరిగేస్తున్నాడు. అతడితో పాటు ఇద్దరు ముగ్గురు క్రికెటర్లను వెంటతీసుకెళ్తున్నాడు. గురువారం రవీంద్ర జడేజా, సురేష్ రైనాలతో స్టేడియం సమీపంలోని హోటళ్లన్నీ తిరిగాడు.
తనక ఇష్టమైన మెక్సికన్ వ్రాప్‌ను కడుపునిండా ఆరగించాడు. కాగా, క్రికెటర్లు వచ్చారని తెలిసి.. ఆ హోటల్ అభిమానులతో కిక్కిరిసిపోయింది. అక్కడి నుంచి బయటపడిన ఆటగాళ్లు దగ్గరలోని ప్రముఖ జ్యూస్ షాప్‌కు వెళ్లి వివిధ పండ్ల రసాలను రుచిచూశారు.

ఇది ఇలా ఉండగా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి, రోహిత్‌శర్మ సమీపంలోని అందమైన ప్రదేశాల వేటలో పడ్డారు. మానసిక ఉల్లాసానికి గురి చేసే వివిధ అందమైన ప్రదేశాలను చుట్టేశారు. సెయింట్ కిల్డా బీచ్‌కు వెళ్లి అక్కడి అందాలను ఆస్వాదించారు.
అశ్విన్, భువనేశ్వర్ ఫిట్
దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సమీపిస్తున్న కొద్దీ ఆటగాళ్ల పిట్నెస్‌పై అనుమానాలు నెలకొన్నాయి. బుధవారం చేతి వేళ్లకు పట్టీ కట్టుకుని రవిచంద్రన్ అశ్విన్ కనిపించడంతో అతడు గాయపడ్డాడేమోననే సందేహాలు ఏర్పడ్డాయి. అలాగే భువనేశ్వర్ ఫిట్నెస్‌లపై కూడా సందేహాలున్నాయి. కాగా, టీమిండియా మనేజర్ బాబా మాత్రం అశ్విన్, భువనేశ్వర్ దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఎంపికకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశాడు.