Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బెయిర్ స్టో ఫోటో వైరల్: ధోని-సాక్షితో పోలిక పెడుతూ నెటిజన్ల ట్వీట్లు

MS Dhoni-Sakshi story as Jonny Bairstow makes eye contact with hotel staff

హైదరాబాద్: పైన ఉన్న ఫోటోని చూశారా! ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాజ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం సన్‌రైజర్స్‌ తర్వాతి మ్యాచ్‌ కోసం ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీలో అడుగుపెట్టిన తర్వాత అడుగుపెట్టిన హైదరాబాద్‌ ఆటగాళ్లు బస చేసేందుకు ఓ హోటల్‌కు వెళ్లారు. ఆ హోటల్‌లో చోటు చేసుకుంది ఈ సంఘటన.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

శాలువాలతో సత్కరించిన హోటల్ యువతి

శాలువాలతో సత్కరించిన హోటల్ యువతి

ఐపీఎల్‌లో భాగంగా ఆయా జట్లు దేశంలోని పలు నగరాల్లో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా దేశంలోని ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తోన్న నగరాలకు ఆయా జట్లు వెళ్లాల్సి ఉంటుంది. తమ తదుపరి మ్యాచ్‌లో భాగంగా సన్‌రైజర్స్ ఢిల్లీ హోటల్‌కు వెళ్లిన సందర్భంలో ఆటగాళ్లకు అక్కడి సిబ్బంది సంప్రదాయ పద్ధతిలో పట్టు శాలువాలతో సత్కరించారు.

చూపులు కలిశాయి

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించిన జానీ బెయిర్‌స్టో మెడలో హోటల్ స్టాఫ్‌కు సంబంధించిన యువతి శాలువా కప్పుతున్న సమయంలో వారిద్దరి తదేకంగా చుసుకున్నారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ ఫోటోకి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ అతడి భార్యకు ముడిపెడుతూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ధోని సైతం సాక్షిని ఇలాగే

ధోని సైతం సాక్షిని ఇలాగే కలుసుకోవడం విశేషం. అప్పట్లో టీమిండియా బస చేస్తున్న హోటల్‌లో సాక్షి ఇంటర్న్‌గా చేరింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో 2010లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు బెయిర్ స్టో ఫోటో కూడా అలాగే అనిపిస్తుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

మూడవ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్‌గా

మూడవ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్‌గా

కాగా, సన్‌రైజర్స్ ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (114), డేవిడ్ వార్నర్ (100 నాటౌట్) సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో సెంచరీ నమోదు చేసిన మూడవ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్‌గా అరుదైన ఘనత సాధించాడు. గతంలో ఐపీఎల్‌లో కెవిన్ పీటర్సన్(2012), బెన్ స్టోక్స్(2017)లో సెంచరీలను నమోదు చేశారు. ప్రస్తుతం కెవిన్ పీటర్సన్ ఇదే ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా వ్యవహారిస్తుండగా... బెన్ స్టోక్స్ మాత్రం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

Story first published: Tuesday, April 2, 2019, 19:13 [IST]
Other articles published on Apr 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+