Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2011 ప్రపంచ కప్‌లో ధోనీ సిక్స్ కొట్టిన బ్యాట్: బెంగాళీ మార్కెట్లో ప్రదర్శన

న్యూఢిల్లీ: సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనున్న నేపథ్యంలో... 2011లో భారత క్రికెట్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ సిక్స్ కొట్టి కప్పు అందించిన బ్యాట్‌ను బెంగాళీ మార్కెట్లో ప్రదర్శనకు ఉంచారు. 2011లో ధోనీ భారీ సిక్స్‌తో భారత్‌కు కప్ తెచ్చాడు.

ఈ బ్యాట్‌ను జూలై 18, 2011న ఓ వ్యాపారవేత్త లక్ష పౌండ్లకు కొన్నారు. ఇది గిన్నిస్ వరల్ట్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. దీనిని ఇప్పుడు వేలం వేస్తే దాదుపు రూ.కోటికి అమ్ముడు పోవచ్చునని భావిస్తున్నారు.

ఈ బ్యాట్‌ను కొన్న వ్యక్తి అమిత్ భాగ్ చంద్కా. అతను ఆర్కే గ్లోబల్ అనే ఫైనాన్షియల్ కంపెనీకి సీఈవో. ఇతను ధోనీకి పెద్ద అభిమాని.

MS Dhoni's World Cup-winning bat on display

అతను ఐఏఎన్ఎస్‌‍తో మాట్లాడుతూ.. ఈ బ్యాట్ ఆర్కే గ్లోబల్ సంస్థ కొన్నప్పటికీ.. ఇది ఎప్పటికీ ధోనీకే చెందుతుందని చెప్పారు. ఈ బ్యాట్‌కు తాము సంరక్షకులుగా మాత్రమే భావిస్తున్నామని చెప్పాడు. చిన్నప్పటి నుండి తాము కపిల్ దేవ్ ప్రపంచ కప్ (1983) అందుకున్న ఫోటోలనే చూస్తు వస్తున్నామని, అయితే ధోనీ 2011లో కప్ గెలిపించి మనం కళ్లారా చూసేలా చేశాడన్నారు.

2015లో భారత జట్టు మరోసారి ప్రపంచ కప్ గెలిస్తే.. మళ్లీ ధోనీ బ్యాట్ కొంటారా అని ప్రశ్నిస్తే.. తప్పకుండా అని సమాధానమిచ్చారు. మరోసారి కప్ గెలిస్తే ఎలాంటి అనుమానం లేకుండా తానే సొంతం చేసుకుంటానని చెప్పారు. వారి కప్‌తో తిరిగి వస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. 11 హీరోలను కలిగి ఉన్నామని చెప్పారు.

ధోనీ వ్యక్తిత్వం ఆయనను ఎవరినైనా ప్రేమించేలా చేస్తుందని చెప్పారు. కాగా, ధోనీ ఉపయోగించిన ఈ బ్యాట్ కొన్నప్పటి నుండి ఇతను ధోనీకి స్నేహితుడు అయ్యారు. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియను భారత్ తప్పకుండా ఓడిస్తుందని, పైనల్లో సౌతాఫ్రికాతో పోటీ పడుతుందని జోస్యం చెప్పారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+