For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని భార్య సాక్షి 'తగని' డ్రస్సు: విషం చిమ్మిన నెటిజన్లు, ట్రోల్

By Nageshwara Rao
MS Dhoni’s wife Sakshi slammed for inappropriate outfit, trolls trash her beautiful dress

హైదరాబాద్: ఉన్నట్టుండి ప్రేమ, అసహ్యం పుట్టే చోటేంటో ఏదో తెలుసా? సోషల్ మీడియా. ఎవరైనా సరే తమకు నచ్చితే వెంటనే అభిమానిస్తూ వారిపై సోషల్ మీడియాలో ప్రేమ కురిపిస్తారు. అదేవిధంగా ఎవరైనా నచ్చకపోతే వెంటనే అసహ్యం చూపిస్తారు.

తాజాగా, ఇలాంటి అనుభవాన్నే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి ఎదుర్కొంది. సాక్షి ఇటీవల తన స్నేహితురాలు, మాజీ కేంద్ర మంత్రి ప్రపుల్ పటేల్ కుమార్తె పూర్ణ పటేల్‌ సంగీత్‌ కార్యక్రమానికి భర్త ధోనితో కలిసి హాజరైన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ మనీష్‌ మల్హోత్రా డిజైన్‌ చేసిన డ్రెస్సును ఆమె ధరించింది. అయితే, ఇప్పుడు ఆ డ్రెస్సు ధరించినందుకు గాను సోషల్‌ మీడియాలో ఆమెపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ధోని భార్య సాక్షిని లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

'ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో తెలీదా? అది అవసరమా? అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా మరొక నెటిజన్ సెలబ్రిటీ భార్య అయినంత మాత్రానా ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటావా? నీకలు డ్రెస్సింగ్‌ సెన్సే లేదు' అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే సాక్షి వేసుకున్న డ్రెస్సు ఆమెకు చక్కగా నప్పిందని, మద్దుతుగా నిలిచిన వారు కూడా ఉన్నారు. ఆ ఫోటోలో ఎలాంటి తప్పు లేదని.. ట్రోల్‌ చేసే వాళ్ల ఆలోచనలే తప్పుగా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు.

Story first published: Wednesday, August 1, 2018, 11:20 [IST]
Other articles published on Aug 1, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+