'ఈ మనిషితో 2020': పార్టీ వేర్‌లో మరింత అందంగా ధోని భార్య సాక్షి

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నూతన సంవత్సరాన్ని తన భార్య సాక్షి ధోనితో కలిసి స్వాగతం పలికాడు. ఈ విషయాన్ని ధోని భార్య సాక్షి తన ఇనిస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలో ధోని, సాక్షి ఇద్దరూ పార్టీ డ్రెస్‌ను ధరించారు.
ఈ ఫోటోని తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసిన సాక్షి "ఈ మనిషితో 2020" అంటూ లవ్ సింబల్‌ను పోస్టు చేసింది. కాగా, నూతన సంవత్సరాన్ని ఘనంగా జరుపుకునేందుకు ధోని కుటుంబ సభ్యులతో కలిసి దుబాయికి వెళ్లిన సంగతి తెలిసిందే. ధోని వెంట పాండ్యా కూడా ఉన్నాడు.
View this post on InstagramA post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on
కాగా, ఈ అత్యుత్తమ వికెట్ కీపర్ ధోని నిలిచాడు. ప్రస్తుత క్రికెట్‌లో అత్యుత్తమ కీపర్ ఎవరంటే ధోనీనే అని చెపుతారు. తనను మించిన కీపర్ లేడనేంతగా ప్రభావం చూపాడు. ధోనీ 2009-2019లో భారత్ తరపున 196 వన్డేలు ఆడాడు. 242 మంది బ్యాట్స్‌మన్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. ఇందులో 170 క్యాచులు, 72 స్టంపింగ్‌లు ఉన్నాయి. ఇక మొత్తం కెరీర్‌లో 350 వన్డేల్లో 321 క్యాచులు, 123 స్టంపింగ్‌లు చేసాడు.
ధోనీ పునరాగమనం ఐపీఎల్‌పై ఆధారపడి ఉంది. టీ20 ప్రపంచకప్‌కు ధోనీ సేవలు అవసరమని జట్టు భావిస్తే.. అతడు టీమిండియాలో తప్పక ఉంటాడు అని భారత మాజీ కెప్టెన్, దిగ్గజం అనిల్ కుంబ్లే అన్నారు. ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో ఆల్‌రౌండర్ల కంటే వికెట్లు తీసే సత్తా ఉన్న బౌలర్లపై టీమిండియా దృష్టి పెట్టాలని సూచించారు.
కుంబ్లే మాట్లాడుతూ... 'ఐపీఎల్‌లో ధోనీ ఎలా ఆడుతాడో చూడాలి. మహీ పునరాగమనం ఐపీఎల్‌పై ఆధారపడి ఉంది. టీ20 ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడుతోంది కాబట్టి మహీ సేవలు అవసరమని జట్టు భావిస్తే టీమిండియాలో తప్పక ఉంటాడు. అయితే దీని కోసం మనం వేచి చూడాలి' అని పేర్కొన్నారు.
ప్రపంచకప్ 2019 ముగిసినప్పటి నుండి ధోనీ విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌లో ధోనీ చివరిసారిగా ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications