Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెమీ ఫైనల్: ఆసీస్ పేసర్లను ఎదుర్కొనేందుకు ధోని టెన్నిస్ రాకెట్ ఫార్ములా..!

సిడ్నీ: ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా సెమీ పైనల్స్‌లో భారత్, ఆస్టేలియాతో మార్చి 26న తలపడనుంది. ఆస్టేలియా పేసర్లను ఎదుర్కొనేందుకు గాను ధోని కొత్త ప్రణాళికను టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు పరిచయం చేశాడు.

ఆస్టేలియా పేసర్లు బౌన్సర్లకు ప్రసిద్ధి. అలాంటి బౌన్సర్లను ఎదుర్కొనేందుకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఓ సరికొత్త ఐడియాను ప్రవేశపెట్టాడు. ఆ సరికొత్త ఐడియాలో భాగంగా కెప్టెన్ ధోని నెట్ ప్రాక్టీస్‌లో టెన్నిస్ రాకెట్‌తో పాటు టెన్నిస్ బంతిని చేతపట్టి నెట్స్‌లో జట్టు చేత ప్రాక్టీస్ చేయించాడని బీసీసీఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు.

సురేష్ రైనా ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ కావడంతో అతనికి టెన్నిస్ రాకెట్‌తో బంతిని కొడుతూ ధోని కొన్ని బంతులు సంధించాడు. ఇలా 15 నుంచి 20 నిమిషాల పాటు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. అనంతరం కొన్ని సూచనలను ధోని, సురేష్ రైనాకు సూచించాడు.

MS Dhoni's tennis racquet formula to handle Australian pacers in World Cup semi-final

ఆ తర్వాత మరో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్‌కు కూడా అదే విధంగా కొన్ని బంతులను రాకెట్‌తో బంతిని కొడుతూ కొన్ని బంతులు సంధించారు. సాధారణంగా ఆస్టేలియా బౌలర్లు బౌన్సర్లు సంధించడంలో దిట్ట. వారిని ఎదుర్కొవాలంటే ఇదే సరైన నెట్స్ ప్రాక్టీస్ అంటూ ధోని తన సహచర జట్టు సభ్యులకు తెలిపారు.

గురువారం ఆస్టేలియాతో జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జట్టు సభ్యులకు ధోని సూచించాడు. మరో రెండు రోజులు టీమిండియా ప్రాక్టీస్‌ చేసే అవకాశం ఉంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+