ధోనీ గురించి నిర్ణయం తీసుకోవడానికి ఎవ్వరూ సరిపోరు: బ్రావో

హైదరాబాద్: సహచరుడు.. జట్టు కెప్టెన్ అయిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ గురించి వెస్టిండీస్ మాజీ క్రికెటర్.. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ డేన్ బ్రావో వ్యతిరేకంగా స్పందించాడు. ధోనీ టీ20 కెరీర్‌ని ఎవరూ డిసైడ్ చేయలేరని బ్రావో వెల్లడించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో మెరుపులు కురిపించిన ధోనీ.. ఆ తర్వాత జరిగిన ఇంగ్లాండ్ పర్యటనలో, వెస్టిండీస్ పర్యటనలలో మాత్రం రాణించలేకపోయాడు. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లోనూ పేలవంగా విఫలమయ్యాడు.

టీ20 కెరీర్ ముగిసిపోయినట్లేనని
ఇదే కారణంతో ఆస్ట్రేలియాతో జరగనున్నటీ20లకి సెలక్లర్లు అతడ్ని పక్కన పెట్టేశారంటూ వార్తలు వినిపించాయి. ఇక ధోనీ కెరీర్ ముగిసినట్లే. టీ20లకు కూడా విరామం ప్రకటించాల్సిందేనంటూ చెప్పుకొచ్చారు. టీమిండియా వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ని ఎంపిక చేయడంతో.. ధోనీ టీ20 కెరీర్ ఇక ముగిసిపోయినట్లు వచ్చిన వార్తలు బలపడ్డాయి. ధోనీ టీ20 కెరీర్‌పై వస్తున్న వదంతులపై తాజాగా డ్వేన్ బ్రావో స్పందించాడు.

స్వయంగా నిర్ణయించుకుంటేనే కానీ
ధోనీ లాంటి స్టార్ క్రికెటర్ కెరీర్.. స్వయంగా అతను నిర్ణయించుకుంటేనే కానీ సాధారణంగా ఎవరో నిర్ణయిస్తే జరిగేది కాదు. విమర్శకులు తోచినట్లు మాట్లాడుతూనే ఉంటారు. ఐపీఎల్ 2018కి ముందు ధోనీ గురించి మాట్లాడిన వారందరికీ సీజన్‌లో బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ఆటగాళ్ల స్థాయిని బట్టి.. దాని ప్రభావం ఉంటుంది. కానీ.. ధోనీ ఇప్పటికే తన సత్తా నిరూపించుకున్న ఆటగాడు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ధోని కూడా ఒకడిగా ఉంటాడు. కాబట్టి.. రిటైర్మెంట్‌పై అతనే ఓ నిర్ణయం తీసుకుంటాడు. అంతేతప్ప.. ఎవరూ అతని టీ20 కెరీర్‌ని డిసైడ్ చేయలేరు.

టీ10 లీగ్ కూడా భవిష్యత్‌లో అభివృద్ధి
రస్తుతం అతను ఆడుతున్న టీ10 లీగ్ గురించి అడిగిన ప్రశ్నలకు ఇలా సమాధానాలిచ్చాడు. ట్వంటీతో పోల్చుకుంటే టీ10లీగ్ చాలా కొత్తది. టీ20లీగ్‌లో లాగే ఇక్కడ కూడా రాణించేందుకు కష్టపడుతున్నాను. టీ10 లీగ్ కూడా భవిష్యత్‌లో అభివృద్ధి చెందుతుందనుకుంటున్నాను. ఎందుకంటే సీనియర్ క్రికెటర్లు సైతం ఇందులో ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిలో ఆడటం వల్ల శారీరకంగా అలసిపోయేదేమీ లేదు. అందుకనే మెరుగైన ప్లేయర్లు కూడా ఆడేందుకు మొగ్గు చూపుతున్నారు' అని చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications