వైరల్ వీడియో.. రివర్స్‌ హెలికాప్టర్ షాట్.. చూస్తే షాకే!!

హైదరాబాద్: క్రికెట్‌ చరిత్రలో హెలికాఫ్టర్ షాట్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ. బ్యాట్‌ను హెలికాఫ్టర్ రెక్కల్లా గుండ్రగా తిప్పుతూ ధోనీ కొట్టే సిక్సులు చాలా ఫేమస్. ధోనీ ఈ షాట్ కొడితే.. కచ్చితంగా బంతి స్టాండ్స్‌లోకి వెళ్లాల్సిందే. మహీ ప్రవేశపెట్టిన ఈ షాట్‌ను ఎందరో క్రికెటర్లు ఆడేందుకు ప్రయత్నించారు. వీరిలో కొందరు సఫలమైతే.. మరి కొందరికి మాత్రం పరాభవం తప్పలేదు. టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్డిక్ పాండ్యా, అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సఫలం కాగా.. వెస్టిండీస్ ఆటగాడు కీమో పాల్‌ విఫలమయ్యాడు. అయితే తాజాగా పాకిస్థాన్‌కి చెందిన ఓ ప్లేయర్ రివర్స్‌ హెలికాప్టర్ షాట్ ఆడాడు.

రివర్స్‌ హెలికాప్టర్ షాట్:

పాకిస్థాన్‌కి చెందిన ఓ ఆటగాడు స్ట్రీట్ క్రికెట్‌లో రివర్స్‌లో హెలికాప్టర్ షాట్ ఆడేసి అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశాడు. బౌలర్ కాళ్ల వద్ద యార్కర్‌ని సంధించబోతున్నట్లు ముందుగానే ఊహించిన ఆ ప్లేయర్.. రివర్స్ హెలికాప్టర్‌ షాట్‌ ఆడదానికి సిద్ధమైపోయాడు. బంతి కాళ్ల మధ్య పడడమే ఆలస్యం.. ఒక కాలిని పైకెత్తి రివర్స్ లాప్ట్ షాట్ ఆడాడు. బంతి బ్యాట్‌కి కనెక్ట్ కావడంతో.. బౌండరీ లైన్ వెలుపల పడింది. అక్కడే ఉన్న ఫీల్డర్ ఆ బంతిని అందుకునేందుకు గాల్లోకి ఎగిరినా.. ఫలితం లేకపోయింది. అయితే అక్కడ కామెంటరీ కూడా ఉండడం విశేషం.

లగాన్ సినిమాలో ఇలానే:

స్ట్రీట్ క్రికెట్‌లో ఆడిన రివర్స్‌ హెలికాప్టర్ షాట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు ఈ వీడియోని షేర్ చేస్తూ.. లైకులు కొడుతున్నారు. అంతేకాదు షాట్ ఆడిన కుర్రాడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ క్రికెటర్ పాత్రలో నటించిన సినిమా లగాన్. ఆ సినిమాలో రాజేష్ వివేక్ ఇలానే షాట్ ఆడాడు. ఆ షాట్‌ నుండే పాకిస్థాన్‌ స్ట్రీట్ క్రికెటర్ స్ఫూర్తి పొందాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు మీరు ఓ లుక్కేయండి. చూస్తే మాత్రం కచ్చితంగా చూస్తే షాక్ అవుతారు.

 రషీద్‌ హెలికాప్టర్‌ షాట్:

రషీద్‌ హెలికాప్టర్‌ షాట్:

అచ్చం ఎంఎస్ ధోనీలాగే.. అఫ్గానిస్థాన్‌ స్పిన్నర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఆటగాడు రషీద్‌ ఖాన్‌ ఇటీవల హెలికాప్టర్‌ షాట్‌ ఆడి అలరించాడు. కాకపోతే రషీద్‌ ఆడింది క్రికెట్‌ బంతితో కాదు.. టెన్నిస్‌ బంతితో. లో ఫుల్‌టాస్‌ వచ్చిన బంతిని అమాంతం లాంగ్‌ ఆన్‌లోకి బాదాడు. గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ర‌షీద్.. అఫ్గనిస్తాన్‌ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించాడు. ఆ వీడియోను ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

 ఐపీఎల్ 2020లో ప్రయత్నిస్తారేమో:

ఐపీఎల్ 2020లో ప్రయత్నిస్తారేమో:

యూఏఈ వేదికగా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజ‌న్‌ సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు జరగనుంది. కరోనా వ్యాప్తి కారణంగా షార్జా, అబుదాబి మరియు దుబాయ్ వేదికల్లో అన్ని మ్యాచులు జరగనున్నాయి. ఇక ఫ్రాంచైజీలు ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటున్నాయి. 8 జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో.. ఏ క్రికెటరైనా ఈ రివర్స్‌ హెలికాప్టర్ షాట్ ప్రయత్నిస్తాడో చూడాలి.

IPL 2020: చెన్నై ఆటగాళ్లకు షాక్.. ఫ్యామిలీస్‌కి నో ఎంట్రీ!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, August 12, 2020, 16:46 [IST]
Other articles published on Aug 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X