Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి టీ20లో ధోని బుల్లెట్ షాట్‌ని చూశారా? (వీడియో)

MS Dhoni's shot almost killed me, says KL Rahul

హైదరాబాద్: భారత్ జట్టు ఆటగాళ్లందరూ తమ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని పొగడ్తలతో ముంచెస్తున్నారు. బుధవారం కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్‌లో ధోనీ మళ్లొకసారి విజృంభించాడు. ధోనీతో పాటుగా క్రీజులో ఉన్న కేఎల్ రాహుల్ ధోనీ షాట్‌లు చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు.

22బంతులకు గాను 39 పరుగులను చేసిన మహేంద్రసింగ్ ధోనీ బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైలెట్‌గా నిలిచాడు. ఇంత గొప్ప ప్రదర్శనకు గాను అతన్ని నాలుగో స్థానానికి రోహిత్ శర్మ ప్రమోట్ చేశాడు.

14వ ఓవర్ ధనంజయ బౌలింగ్ వేస్తుండగా ధోని క్రీజులోకి దిగాడు. అప్పటి వరకు సంశయంతో ఆడుతున్న కేఎల్ రాహుల్ సందిగ్ధమంతా ధోనీ ఒక్క షాట్ తో తుడిచేశాడు. ఆ షాట్‌కి కేఎల్ రాహుల్ 'అలా చూస్తుండగానే ఒక్క షాట్‌తో ధోనీ మెరిపించాడు. ' అని కితాబిచ్చాడు. వీరిద్దరి భాగస్వామ్యంలో పదకొండు పరుగులు చేశారు. తర్వాత వచ్చిన మనీశ్ పాండేతో కలిపి ధోనీ 68 పరుగులను చేశారు.

రోహిత్ శర్మ పనిలో పని అన్నట్లుగా కేఎల్ రాహుల్‌ని కూడా పొగిడేశాడు. వన్డే జట్టులో తాను సభ్యుడు కాకపోయినా ఈ మ్యాచ్‌కు బ్యాటింగ్‌లో తన అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడని ప్రశంసించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకా మాట్లాడుతూ.. యజువేంద్ర చాహల్ చాలా కృషి చేశాడు. ప్రత్యర్థికి 4/23 స్కోరును మాత్రమే చేసే విధంగా తన బౌలింగ్ మాయాజాలాన్ని ప్రదర్శించాడని వ్యాఖ్యానించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 21, 2017, 18:17 [IST]
Other articles published on Dec 21, 2017
Read in English: KL Rahul hails MS Dhoni
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+