ఆస్ట్రేలియాతో వన్డే సిరిస్: మూడు నెలలు తర్వాత మళ్లీ బరిలోకి ధోని


హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకోనున్నాడా? అంటే అవుననే సమాధానం వినవస్తోంది. పేలవ ఫామ్ కారణంగా ఇటీవల వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20 సిరీస్ నుంచి సెలక్టర్లు ధోనిని తప్పించి, అతని స్థానంలో రిషబ్ పంత్‌కి వికెట్ కీపర్‌గా అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే.
దీంతో ధోని టీ20 కెరీర్ ముగిసిపోయిందంటూ మాజీ క్రికెటర్లు అభిప్రాయపడగా.. వన్డే కెరీర్ కూడా ప్రమాదంలో ఉందని మరికొందరు తమ సందేహాలను వెలిబుచ్చారు. అయితే ఆస్ట్రేలియాతో జనవరి 12 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌తో పాటు ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌కి కూడా ధోనీకి అవకాశమివ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సెలక్టర్లు నిర్ణయం
ఈ మేరకు సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారని, అధికార ప్రకటన వెలువడాల్సి ఉందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న 2019 వన్డే వరల్డ్‌కప్‌కు వికెట్ కీపర్‌గా ధోనీనే ఉంటాడని ఇప్పటికే చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.

రెండో వికెట్ కీపర్ అన్వేషణలో భాగంగా
రెండో వికెట్ కీపర్ అన్వేషణలో భాగంగానే దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్‌కి అవకాశాలిచ్చినట్లు రెండు నెలల క్రితం సెలక్టర్లు వెల్లడించారు. నిజానికి ఈ ఏడాది వన్డే, టీ20ల్లో ధోనీ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు. 13 ఇన్నింగ్స్‌ల్లో కనీసం ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు.

ధోని గణాంకాలే ఆ విషయాన్ని
దీంతో ధోని యావరేజి 25కిలోపు పడిపోయింది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇంత పేలవంగా ధోనీ ఎప్పుడూ ఆడలేదని గణాంకాలు చెప్తున్నాయి. అయితే, వికెట్ల వెనుక అతని నైపుణ్యం, వ్యూహాల్లో అతని అనుభవాన్ని పరిగణలోకి తీసుకున్న సెలక్టర్లు వరల్డ్ కప్ వరకూ టీమ్‌లో కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం.

మూడు నెలల తర్వాత మళ్లీ
మరోవైపు రెండో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ ఎంపికయ్యే అవకాశాలున్నాయి. తాజా నిర్ణయంతో మూడు నెలల తర్వాత మళ్లీ భారత్ తరఫున ధోనీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఆస్ట్రేలియాతో జనవరి 12 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆడనున్న భారత్.. ఆ తర్వాత జనవరి 23 నుంచి న్యూజిలాండ్‌తో ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications