న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని రిటైర్మెంట్‌పై అతడి పేరంట్స్ ఏమనుకుంటున్నారో తెలుసా?

MS Dhoni’s Parents Want Him to Retire, Says His Childhood Coach || Oneindia Telugu
MS Dhoni’s Parents Want Him to Retire, Says His Childhood Coach

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలనేదే వారి తల్లిదండ్రులు నిర్ణయమని ధోని చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ వెల్లడించాడు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో విజయం సాధించి ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలని టీమిండియా భావించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అయితే, ఈ ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీస్‌లో 18 పరుగుల తేడాతో ఓటమిపాలై టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని వీడ్కోలు పలకనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ధోని తన రిటైర్మెంట్‌పై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయలేదు.

వెస్టిండిస్ పర్యటనకు టీమిండియా

వెస్టిండిస్ పర్యటనకు టీమిండియా

ప్రపంచకప్ తర్వాత టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు వెళ్లనుంది. జులై మూడు నుంచి జ‌రుగనున్న విండీస్ పర్యటనకు జ‌ట్టును ఎంపిక చేయ‌డం కోసం శుక్ర‌వారం టీమిండియా సెలెక్ష‌న్ క‌మిటీ ముంబైలో స‌మావేశం కానుంది. ఈ నేప‌థ్యంలో ధోని విండిస్ పర్యటనకు ఎంపికవుతాడా? లేదా అనే చ‌ర్చ మొద‌లైంది.

ధోని చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ మాట్లాడుతూ

ధోని చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో బుధవారం స్పోర్ట్స్ తక్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ధోని చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ మాట్లాడుతూ ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాల‌నే అత‌డి త‌ల్లిదండ్రులు సైతం కోరుకుంటున్న‌ట్టు ఆయన వెల్ల‌డించారు. "గ‌త ఆదివారం నేను ధోనీ ఇంటికి వెళ్లి అత‌ని త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడాను. ధోనీ ఇక క్రికెట్‌ను విడిచిపెడితే బాగుంటుంద‌ని వారు కోరుకుంటున్నారు" అని ఆయన తెలిపాడు.

ధోని రిటైర్ అయితే బాగుండు

ధోని రిటైర్ అయితే బాగుండు

ఇప్పటివరకు ధోని ఎంతో క్రికెట్ ఆడాడని, రిటైర్ అయి త‌మ‌తో పాటు ఇంట్లో ఉండాల‌ని వారు ఆశిస్తున్నట్లు కేశవ్ బెనర్జీ చెప్పుకొచ్చాడు. అయితే, ధోనీ మ‌రో ఏడాది పాటు క్రికెట్ ఆడాల‌ని, టీ20 ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తే బాగుంటుంద‌ని తాను వారికి చెప్పానని అన్నాడు.

ప్రపంచకప్‌లో ధోని టాప్ స్కోరు 56

ప్రపంచకప్‌లో ధోని టాప్ స్కోరు 56

అయితే, ధోని తల్లిదండ్రులు మాత్రం ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని ఇంటి పట్టున ఉండాలని కోరుకుంటున్నార‌ని తెలిపాడు. కాగా, ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్‌లో మొత్తం 8 మ్యాచ్‌లాడిన ధోని 273 పరుగులు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో ధోని అత్యధిక స్కోరు 56.

Story first published: Wednesday, July 17, 2019, 14:05 [IST]
Other articles published on Jul 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X