RR vs CSK మ్యాచ్‌లో ధోని చేసింది తప్పే!

హైదరాబాద్: జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని ప్రవర్తించిన తీరుపై రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ పేర్కొన్నాడు. టోర్నీలో భాగంగా గురువారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ధోని డగౌట్ నుంచి ఫీల్డ్‌లోకి వెళ్లి మరీ అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఒకసారి మైదానం విడిచి వెళ్లిపోయిన క్రికెటర్ మళ్లీ మైదానంలోకి వచ్చి వివరణ కోరడం కచ్చితంగా తప్పేనని జోస్ బట్లర్ చెప్పాడు. మ్యాచ్ అనంతరం జోస్ బట్లర్ మాట్లాడుతూ "ఆ సమయంలో నేను బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నా. ఏం జరిగిందో నాది నాకు పూర్తిగా తెలియదు. ఐపీఎల్ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి" అని అన్నాడు.

ప్రతి ఒక్క పరుగు కూడా కౌంట్ అవుతుంది
"ప్రఐపీఎల్‌లో ప్రతీ రన్ ముఖ్యమే. అందుకు టెన్షన్ ఉండటమూ సహజమే.డగౌట్ నుంచి ధోని వచ్చిఅంపైర్లను ప్రశ్నించడం సరైన చర్య కాదు. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. అందులో ధోని ఇలా ఫీల్డ్‌లోకి రావడం గేమ్‌లో మరింత వేడి పుట్టించింది. చివరకు మ్యాచ్‌ను చేజార్చుకోవడం నిరాశ కలిగించింది. గెలుస్తామనుకున్న మ్యాచ్‌లో ఓడాం" అని బట్లర్ అన్నాడు.

ఈ సీజన్‌లో వరుస ఓటములు
ఈ సీజన్‌లో వరుస ఓటములు మా జట్టుని తీవ‍్ర నిరాశకు గురిచేస్తున్నాయని జోస్ బట్లర్ చెప్పాడు. అయితే, ఈ మ్యాచ్‌లో తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో రాజస్థాన్ విఫలమైంది. ఈ మ్యాచ్‌లో జోస్ బట్లర్ 10 బంతుల్లో 23 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది.

152 పరుగుల విజయ లక్ష్యంతో
అనంతరం 152 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఇన్నింగ్స్ పేలవంగా ప్రారంభమైంది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బంతికే వాట్సన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే ఆర్చర్ వేసిన సూపర్ త్రోకు సురేశ్ రైనా (4) రనౌటయ్యాడు. దీంతో మూడు ఓవర్లకు గాను చెన్నై 10 పరుగులు మాత్రమే చేసింది. ఈ స్థితిలో భారీ షాట్‌కు పోయిన డుప్లెసిస్ (7) ఉనాద్కత్ బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన చెన్నై
ఆ తర్వాత కేదార్ జాదవ్(1) వెనుదిరిగాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన ధోనితో కలిసి అంబాటి రాయుడు ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించారు. రాజస్థాన్ బౌలర్ పరాగ్ బౌలింగ్‌లో ధోని చెలరేగాడు. ఈ క్రమంలో హాఫ్‌సెంచరీ అనంతరం భారీ షాట్‌కు ప్రయత్నించిన రాయుడు(57) గోపాల్ పట్టిన సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు.

ఆఖరి రెండు ఓవర్లలో 30 పరుగులు
చెన్నై విజయానికి ఆఖరి రెండు ఓవర్లలో 30 పరుగులు అవసరమయ్యాయి. దీంతో ఆ జట్టు ఒక్కసారిగా ఒత్తిడిలోకి పోయింది. అయితే, క్రీజులో ధోని ఉండడంతో అభిమానులు చెన్నై గెలుస్తుందనే ధీమాతోనే ఉన్నారు. ఇక, ఆఖరి ఓవర్లో చెన్నై విజయానికి 3 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన తరుణంలో క్రీజులోకి వచ్చిన టెయిలెండర్ సాంట్నర్ 2 పరుగులు చేశాడు. అయితే అంపైర్ దీనిని తొలుత నోబాల్‌గా ప్రకటించగా, ఆ తర్వాత లెగ్ అంపైర్ కాదనడంతో చేయి దించాడు.

నిబంధన 2.20 అతిక్రమించిన ధోని
ఈ క్రమంలో అయోమయం నెలకొనడంతో నాన్-స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న రవీంద్ర జడేజా తొలుత అంపైర్లను ప్రశ్నించాడు. అనంతరం డగౌట్‌లో కూర్చుని ఉన్న కెప్టెన్ ధోని కూడా మైదానంలోకి వచ్చి మరీ అంపైర్లతో వాదించాడు. అంపైర్లు అది నోబాల్ కాదనడంతో ధోని నిరాశగా డగౌట్ చేరాడు. అయితే మైదానంలోకి వెళ్లి అంపైర్లతో వాగ్వాదానికి దిగిన ధోని ఐపీఎల్ నిబంధన 2.20 అతిక్రమించాడని అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications