600పైగా పరుగులు: కెప్టెన్‌గా ధోని రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డుని కోహ్లీ అధిగమించాడు. కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 622/9 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.
తద్వారా కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఇప్పటి వరకు అత్యధికంగా 6 సార్లు 600 అంతకు మించి పరుగులు చేసింది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే కోహ్లీ కెప్టెన్సీలోని భారత జట్టు కేవలం 28 టెస్టుల్లోనే దీనిని సాధించింది. 2016 డిసెంబరు నుంచి ఇప్పటి వరకు భారత్ ఆరు సార్లు 600కి పైగా పరుగులు చేసింది.

ఒక్క ఆస్ట్రేలియా మాత్రేమే 600పైగా పరుగులు
2016 ఫిబ్రవరి నుంచి చూస్తే ఒక్క ఆస్ట్రేలియా మాత్రేమే 600పైగా పరుగులు నమోదు చేసిన జట్టుగా ఉంది. ఇక, గంగూలీ, ధోనీ కెప్టెన్సీలోని భారత జట్టు కేవలం 5 సార్లు మాత్రమే 600కి పైగా పరుగులు చేసింది. 49 మ్యాచుల ద్వారానే గంగూలీ ఈ ఫీట్‌ని సాధించగా, ధోని 60 మ్యాచ్‌ల సమయం పట్టింది.

గతేడాది కాలం నుంచి టెస్టుల్లో భారత్ 600కు పైగా పరుగులు చేసిన సందర్భాలు:
* 759/7decl, against England at Chennai, Dec-2016
* 687/6decl, against Bangladesh at Hyderabad (Deccan), Feb-2017
* 631, against England at Mumbai, Dec-2016
* 622/9decl, against Sri Lanka at Colombo (SSC), Aug-2017
* 603/9decl, against Australia at Ranchi, Mar-2017
* 600, against Sri Lanka at Galle, Jul-2017

ఓ కెప్టెన్ నాయకత్వంలో 600కు పైగా పరుగులు:
* విరాట్ కోహ్లీ (India): 28 మ్యాచ్‌లు, 6 times
* సౌరవ్ గంగూలీ (India): 49 మ్యాచ్‌లు, 5 times
* ధోని (India): 60 మ్యాచ్‌లు, 5 times
* అలెన్ బోర్డర్ (Australia): 93 మ్యాచ్‌లు, 5 times
* గ్రేమ్ స్మిత్ (South Africa / ICC World XI): 109 మ్యాచ్‌లు, 5 times

ఓ భారత కెప్టెన్ నాయకత్వంలో 600కు పైగా పరుగులు:
* విరాట్ కోహ్లీ: 28 మ్యాచ్‌లు, 6 times
* సౌరవ్ గంగూలీ: 49 మ్యాచ్‌లు, 5 times
* ధోని: 60 మ్యాచ్‌లు, 5 times
* అనిల్ కుంబ్లే: 14 మ్యాచ్‌లు, 4 times
* రాహుల్ ద్రవిడ్: 25 మ్యాచ్‌లు, 4 times
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications