ఫ్యాన్స్ పుల్ ఖుష్: పదేళ్ల తర్వాత పొడవాటి జుట్టుతో ధోని (వీడియో)

హైదరాబాద్: పొడవాటి జుట్టుతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని చూసి పదేళ్లు అవుతుంది. అయితే తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఎలా అయితే పొడవాటి జుట్టుతో కనిపించాడో అలాంటి జుట్టుతో మళ్లీ కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు.
శ్రీలంక వేదికగా భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య మంగళవారం నుంచి ప్రారంభం ముక్కోణపు సిరిస్ ప్రారంభం కానుంది. ఈ సిరిస్‌కు గాను రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ధోనిలతో పాటు పలువురు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించి యువ క్రికెటర్లకు సెలక్టర్లు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.
క్రికెట్ నుంచి కాస్త విరామం లభించడంతో ధోని ఒక్కసారిగా బిజీ అయ్యాడు. ఓ చాక్లెట్‌కు సంబంధించిన యాడ్‌లో పాల్గొని అప్పటి ధోనిని మరోసారి అభిమానులకు గుర్తు చేశాడు. ధోని నటించిన స్నిక్కర్స్ చాక్‌లెట్స్‌కు సంబంధించిన ఈ యాడ్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
దీంతో ఈ యాడ్ చూసిన అభిమానులు 'చాలా రోజుల తర్వాత ధోనీ పొడవాటి జుట్టుతో కనిపించాడు, పాత రోజులను గుర్తు చేశాడు' అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెడుతున్నారు. రెండేళ్ల నిషేదం తర్వాత ఐపీఎల్ 11వ సీజన్‌లో ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పునరాగమనం చేస్తోన్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications