Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రూ.లక్ష పలికిన ధోనీ కిట్, జింబాబ్వే కోచ్‌కు బ్యాట్ గిఫ్ట్

ముంబై: భారత వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ కిట్, లియాండర్ పేస్ టెన్నిస్ రాకెట్లను వేలం వేసారు. వీటికి లక్షల రూపాయలు పలికాయి. ధోని క్రికెట్ కిట్ రూ.లక్ష, లియాండర్ రాకెట్లకి లక్షన్నర పలికాయి.

అనారోగ్యంతో బాధపడుతున్న క్రీడాకారులను ఆదుకునేందుకు నడుం బిగించిన ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఓ వెబ్‌సైట్‌ నిర్వహించిన వేలానికి తాము వినియోగించిన వస్తువులను వీరు ఇచ్చారు. ఈ వెబ్ సైట్ ధోనీ క్రికెట్ కిట్, లింయాడర్ పేస్ టెన్నిస్ రాకెట్‌తో పాటు ఇతర విలువైన వస్తువులను వేలం వేసింది.

MS Dhoni's gloves and Leander Paes's racquets auctioned for Rs 2.5 lakhs

పేస్‌ రాకెట్‌‌ను టీమిండియా మాజీ ఆటగాడు, బెంగాల్‌ కెప్టెన్‌ మనోజ్‌ తివారి కొనుగోలు చేయగా, పీలే ఆటోగ్రాఫ్‌ చేసిన ఫుట్‌‌బాల్‌‌ను కోల్‌‌కతాకు చెందిన నిర్మాత నమిత్‌ బజోరియా 1.10 లక్షల రూపాయలకు సొంతం చేసుకున్నారు.

ఈ వేలం సందర్భంగా సమకూరిన 14 లక్షల రూపాయలను కాలేయ కేన్సర్‌‌తో బాధపడుతున్న ఫుట్‌‌బాల్‌ క్లబ్‌ మోహన్‌ బగాన్‌ అభిమాని బాపీ మజ్‌ హి, కేన్సర్‌తో బాధపడుతున్న అలిప్‌ చక్రబర్తి కుటుంబానికి ఇస్తారు.

జింబాబ్వే కోచ్‌కు ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్ ఇచ్చిన ధోనీ

మహేంద్ర సింగ్ ధోనీ తాను ఆటో గ్రాఫ్ చేసిన బ్యాట్‌ను జింబాబ్వే కోచ్‌కు బహుమతిగా ఇచ్చాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్ రెండు వన్డేల్లో గెలిచి సిరీస్ గెలుచుకుంది. సోమవారం నాడు రెండో వన్డేలో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. అనంతరం ధోనీ సంతకం చేసిన బ్యాట్‌ను జింబాబ్వే కోచ్‌కు ఇచ్చాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+