ధోనీ అభిమానులకు దారుణంగా దొరికిపోయిన రోహిత్ శర్మ భార్య

Posted By:
MS Dhoni’s Fans Slam Rohit Sharma’s Wife; Here’s Why

హైదరాబాద్: ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌గా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న రోహిత్ శర్మపై అభిమానంతో తన భార్య ఓ పోస్టు పెట్టింది. దీంతో ఆమెపై ట్విట్టర్ వేదికగా ధోనీ అభిమానులు దూషణకు దిగారు. ఏకంగా రోహిత్‌శర్మ భార్య రితికా సజ్దేను టార్గెట్‌ చేస్తూ ధోని అభిమానులు ట్రోల్‌ చేస్తున్నారు.

అసలేం జరిగిందేంటంటే:
దీనికి కారణం రితికా సజ్దే ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్‌. ఈ పోస్ట్‌ ధోని అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. 'ఓ మ్యాగజైన్‌పై రోహిత్‌ శర్మ కెప్టెన్‌ కూల్‌ అని ఉన్న ఫొటో. అది సంగతి కెప్టెన్‌ కూల్‌ అంటే ధోని ఒక్కడే అర్హుడని ఆయన అభిమానుల వాదన.' ఇంకేముంది సోషల్‌ మీడియా వేదికగా రితికాను నిలదీశారు.

🔥 🔥 🔥 🔥 @rohitsharma45 @gqindia

A post shared by Ritika Sajdeh (@ritssajdeh) on Apr 5, 2018 at 3:52am PDT

కొందరు మర్యాద పూర్వకంగా ఆ ట్యాగ్‌ ధోనిది దయచేసి రోహిత్‌కు ఇవ్వద్దని విజ్ఞప్తి చేయగా..మరి కొందరు.. 'రితికా ఆ ట్యాగ్‌ కోసం అడుక్కోకు!' అంటూ దారుణంగా సెటైర్లు వేశారు. ప్రపంచంలో కూల్‌ కెప్టెన్‌ అంటే ధోనినే మరెవరు కాదని ఇంకొందరు కామెంట్‌ చేశారు.

అయితే రోహిత్‌ అభిమానులు మాత్రం రోహిత్‌ కూల్‌ కెప్టెనేనని అంగీకరిస్తున్నారు. ముంబైని మూడు సార్లు చాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లోనే విజయవంతమైన కెప్టెన్‌ అని అతని అభిమానులు ప్రతి వాదనకు దిగారు. రోహిత్‌ కెప్టెన్సీ ప్రశాంతంగా చేస్తాడని కూల్‌ కెప్టెన్సీ విషయంలో తప్పులేదని రోహిత్‌ భార్యకు మద్దతు తెలుపుతున్నారు. ఈ కామెంట్స్‌పై రితికా సజ్దే మాత్రం స్పందించలేదు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Sunday, April 8, 2018, 15:44 [IST]
Other articles published on Apr 8, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి