న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ డకౌట్: ఆవేశంతో ఊగిపోయిన చిన్నారి అభిమాని(వీడియో)

Asia Cup 2018 : Young Boys Reaction After MS Dhoni Dismissal For A Duck
MS Dhonis fans epic reaction after he was dismissed on 0 during India vs Hong Kong Asia Cup match

దుబాయ్: పసికూనపై పోరాటమే కదా.. అనుకుందో లేదా ప్రత్యర్థి జట్టు అనుకున్నదాని కంటే పటిష్ఠంగా అనిపించిందో కానీ, టీమిండియాకు ఆసియా కప్‌లో తొలి మ్యాచ్ గెలిచేందుకు నానా తంటాలు పడింది. ఆసియా కప్‌ తొలి మ్యాచ్‌లో.. అదీ హాంకాంగ్‌పై మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పేలవరీతిలో డకౌటవడంతో స్టేడియంలో ఓ బాలుడు చూపిన అసహనం ఇప్పుడు అందరికీ నవ్వు తెప్పిస్తోంది.

దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం మూడు బంతులు మాత్రమే ఆడిన ధోనీ కనీసం పరుగుల ఖాతా కూడా తెరవలేకపోయాడు. జట్టు స్కోరు 240 వద్ద ఓపెనర్ శిఖర్ ధావన్ (127)120 బంతుల్లో 15 ఫోర్లు, 2సిక్సులతో ఔటవడంతో క్రీజులోకి వచ్చిన ధోనీ.. హాంకాంగ్ స్పిన్నర్ ఇషాన్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. గత ఏడాది కాలంగా స్పిన్నర్ల బౌలింగ్‌లోనే ఎక్కువగా ధోనీ వికెట్ చేజార్చుకుంటున్న విషయం తెలిసిందే.


ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతిని పాయింట్ దిశగా నెట్టేందుకు ధోనీ ప్రయత్నించగా.. బ్యాట్ అంచున తాకిన బంతి నేరుగా వెళ్లి వికెట్ కీపర్ స్కాట్ చేతుల్లో పడింది. దీంతో.. తన కళ్లని తానే నమ్మలేనట్లు బౌలర్ ఇషాన్ సంబరాలు చేసుకుంటూ.. పిచ్‌ని ముద్దాడగా.. స్టేడియంలో ఉన్న బుడ్డోడు తన ఆరాధ్య క్రికెటర్ ఔటవడంతో గట్టిగా అరుస్తూ అక్కడ ఉన్న కుర్చీలను విరగొట్టేందుకు ప్రయత్నించాడు.

బాలుడి అసహనం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలుడు 'టీమిండియా జెర్సీ నెం.7' ధరించి ఉండటంతో.. అతను ధోనీకి వీరాభిమాని అని స్పష్టంగా తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో ధావన్ సెంచరీ బాదడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. చివరికి హాంకాంగ్‌ను 259/8కు పరిమితం చేసిన భారత్‌.. 26 పరుగుల తేడాతో నెగ్గి ఊపిరి పీల్చుకుంది.

Story first published: Wednesday, September 19, 2018, 9:30 [IST]
Other articles published on Sep 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X