Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ధోని క్రికెట్ అనుభవాన్ని తక్కువ అంచనా వేయొద్దు'

Dhoni's Experience Cant Be Questioned Says Lakshmipathy Balaji | Oneindia Telugu
MS Dhonis Experience Cant Be Questioned: Lakshmipathy Balaji

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని క్రికెట్ అనుభవాన్ని ఎంతమాత్రం ప్రశ్నించాల్సిన అవసరం లేదని మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీ సూచించాడు. గతేడాది పేలవ ఫామ్‌తో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయిన ధోనీ.. ఈ ఏడాది ఆరంభంలోనే ఆస్ట్రేలియాపై మూడు వన్డేల సిరీస్‌లో 'హ్యాట్రిక్' హాఫ్ సెంచరీలు బాది ఫామ్‌లోకి వచ్చాడు.

ఆసీస్ పర్యటనలో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు

ఆసీస్ పర్యటనలో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ‘హ్యాట్రిక్' హాఫ్ సెంచరీలు బాదిన ధోనీ ‘మ్యాన్ ఆఫ్ సిరీస్‌' అవార్డుని కూడా అందుకున్నాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌‌ పర్యటనలోనూ ధోని అటు వికెట్ కీపర్‌గా, ఇటు బ్యాట్స్‌మెన్‌గా అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో ఈ ఏడాది మే నెలలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో ధోని ఆడటంపై గత కొంతకాలంగా నెలకొన్న అనుమానాలు పూర్తిగా తొలగిపోయాయి.

ధోని అనుభవాన్ని తక్కువ అంచనా వేయొద్దు

ధోని అనుభవాన్ని తక్కువ అంచనా వేయొద్దు

ఈ క్రమంలో ధోని అనుభవాన్ని తక్కువ అంచనా వేయొద్దని లక్ష్మీపతి బాలాజీ హితవు పలికాడు. తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో బాలాజీ మాట్లాడుతూ "ధోని అనుభవాన్ని ఎవరూ ప్రశ్నించొద్దు. ఎందుకంటే.. మ్యాచ్‌లో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ధోని కంటే ఎవరూ గొప్పగా వ్యూహాలను రచించలేరు" అని చెప్పుకొచ్చాడు.

యువ బౌలర్లకి సలహాలు

యువ బౌలర్లకి సలహాలు

"యువ బౌలర్లకి అతను సలహాలిస్తాడు. బ్యాటింగ్‌లో మిడిలార్డర్‌‌ని ముందుండి నడిపిస్తాడు. టాప్ ఆర్డర్‌లో రోహిత్ శర్మ, ధావన్, కోహ్లీ లాంటి అనుభవజ్ఞులున్నారు. మిడిలార్డర్‌ పరిస్థితి ఏంటి? ఇక్కడే ధోని అవసరం జట్టుకి ఉంది. అతను ప్రతి మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకుని అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే ప్రయత్నం చేశాడు" అని బాలాజీ తెలిపాడు.

Story first published: Wednesday, February 13, 2019, 14:04 [IST]
Other articles published on Feb 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+