For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నాపై ధోని ప్రభావం, ఎంతో స్ఫూర్తిని నింపుతున్నాడు' (వీడియో)

By Nageshwara Rao
MS Dhoni’s desire to play for CSK has rubbed off on everyone, says Shane Watson

హైదరాబాద్: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ఆ జట్టు ఆటగాడు షేన్ వాట్సన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్ 11వ సీజన్‌లో ధోని అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కీలక ఇన్నింగ్స్ ఆడుతూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. తీవ్ర ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఆడుతూ భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు.

సోమవారం పూణె వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం షేన్ వాట్సన్ మాట్లాడుతూ 'తీవ్ర ఒత్తిడిలోనూ చాలా ప్రశాంతంగా ఉండటం, గెలుపు కోసం అతను పడే తపనతో ధోనీ జట్టు సభ్యుల్లో ఎంతో స్ఫూర్తిని నింపుతున్నాడు' అని వాట్సన్ అన్నాడు.

'ధోని తినడం మనం చూడలేము. మధ్యాహ్నభోజనమైనా.. అ‍ల్పహారమైనా ఒకేలా చాలా ఎక్కువగా తింటాడు. అతనికి నింద్రంటే అమితమైన ప్రేమ. ధోనితో కలిసి ఆడటం మాకు దక్కిన ప్రత్యేక హక్కు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడటమంటేనే ప్రతి ఒక్కరు ధోనితో ఆడినట్టేనని' అని షేన్ వాట్సన్‌ తెలిపాడు.

'బ్యాటింగ్ చేసినప్పుడు కూడా ధోనీలో ఎలాంటి మార్పు ఉండదు. ధోని బంతిని హిట్‌ చేసే విధానం బాగుంటుంది. అతనో అద్బుత ఆటగాడు. అతను ఆడే షాట్‌లు అన్ని రకాల వికెట్‌పై, అందరి బౌలింగ్‌లో ఆడుతాడు. ఒత్తిడిలో సైతం అతను ప్రశాంతంగా ఉంటాడు. ఒకవేళ రన్‌రేట్ పెరిగిపోతుంటే ఏ బౌలర్‌ను రంగంలోకి దించాలో కూడా ధోనీ బాగా తెలుసు. ఎప్పడూ ప్రశాంతంగా ఉండటమనేది నిజంగా అద్భుతం. గత కొద్దిరోజులుగా ధోని దగ్గరగా ఉంటూ అతని గురించి తెలుసుకుంటున్నా ఈ విషయంలో ధోని ప్రభావం నాపై కూడా పడింది' అని వాట్సన్ వెల్లడించాడు.

ఈ సీజన్‌లో చెన్నై తరుపున రాణిస్తోన్న ఆటగాళ్లలో ధోని, వాట్సన్, అంబటి రాయుడు. ఈ ముగ్గరూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. సోమవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో వాట్సన్ ఏడు సిక్సులు, నాలుగు ఫోర్ల సాయంతో 40 బంతుల్లో 78 పరుగులు చేశాడు. ధోని 22 బంతుల్లో 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

వీరిద్దరితో పాటు అంబటి రాయుడు (41), డుప్లెసిస్ (33) రాణించడంతో చెన్నై 211 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేయడంతో చెన్నై 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతేకాకుండా 8 మ్యాచుల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

Story first published: Tuesday, May 1, 2018, 20:39 [IST]
Other articles published on May 1, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+