పాట పాడిన ధోని కుమార్తె జీవా: వీడియో వైరల్
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుమార్తె జీవాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో జీవా మళయాళీ పాట పాటడం విశేషం. నోరు తిరగని పదాలతో శ్రీ కృష్ణుడికి సంబంధించిన ఓ పాటను జీవా పాడింది.
ఇందుకు సంబంధించిన వీడియోని ధోని భార్య సాక్షి తన ఇన్‌స్టాగ్రాం ద్వారా ఈ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కోహ్లీ ఫౌండేషన్ కోసం బాలీవుడ్ తారలతో ఆడిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ధోనికి మంచినీళ్లు అందిస్తున్న ఫొటో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత ధోనితో కలిసి ఓ లడ్డూ కోసం పోటీ పడుతున్న వీడియో కూడా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇలా ధోని కుమార్తె జీవాకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో కూడా క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. నిజం చెప్పాలంటే జీవా ఇప్పటికే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications