Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హెల్‌‌కాట్‌ బైక్‌పై ధోని కూతురు: ఇంటర్నెట్‌లో వైరల్

హైదరాబాద్: టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బైకులంటే ఎంతో మోజు. ఈ విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్లోకి ఏదైనా కొత్త బైక్ వచ్చిందంటే చాలు దానిని వెంటనే ధోని కొనేస్తుంటాడు. అంతేకాదు వాటికి సంబంధించిన చిత్రాలను కోసం సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటాడు.

MS Dhoni's daughter Ziva poses on his Confederate Hellcat

ఇలా ధోని వద్ద సాధారణ బైకుల నుంచి ఖరీదైన స్పోర్ట్స్‌ బైకుల వరకు చాలానే ఉన్నాయి. అయితే ఈసారి అందరికీ ఆశ్చర్యం కలిగించేలా సోషల్ మీడియాలో ధోని కూతురు జీవా దర్శనమిచ్చింది. ధోనికి ఎంతో ఇష్టమైన కాన్ఫెడరేట్‌ హెల్‌ కాట్‌ బైకుపై జీవా కూర్చుని ఉంది.

ధోనీ భార్య సాక్షి ఈ ఫొటోను తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో జీవా నవ్వుతూ ముద్దుగా కనిపిస్తోంది. ఫొటోషూట్‌లో భాగంగా శిప్రా, అమిత్‌ చాబ్రా ఈ ఫొటోను తీశారు. ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌లా మారింది. ధోని అభిమానులు సైతం చిన్నారి జీవాను బైక్‌పై చూసి తెగ ముచ్చటపడిపోతున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+