For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాట ఎఫెక్ట్: ముఖ్య అతిథిగా రావాలని ధోని కుమార్తె జీవాకు ఆహ్వానం

By Nageshwara Rao

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుమార్తె జీవాకి కేరళ ఆలయం నుంచి ఆహ్వానం అందింది. ఇటీవల జీవా ఓ మళయాళం పాట పాడుతున్న వీడియోని ధోని భార్య సాక్షి సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

అందులో రు తిరగని పదాలతో కృష్ణుడికి సంబంధించిన ఓ పాటను జీవా పాడింది. ఇందుకు సంబంధించిన వీడియోని ధోని భార్య సాక్షి తన ఇన్‌స్టాగ్రాం ద్వారా ఈ వీడియోను అభిమానులతో పంచుకోగా, అది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.

MS Dhoni’s daughter Ziva gets invitation from Kerala Temple after her Malayalam song went viral

ఈ పాట ప్రముఖ మలయాళీ నటుడు మోహన్‌లాల్‌ నటించిన 'అద్వైతం' చిత్రంలోనిది కావడం విశేషం. అయితే జీవా పాడిన పాట నెటిజన్లతో పాటు కేరళలోని టీడీబీ(ట్రావన్‌కోర్‌ దేవస్వామ్‌ బోర్డు) అధ్యక్షుడు ప్రయర్‌ గోపాలకృష్ణన్‌‌కు కూడా ఎంతగానో నచ్చింది.

ఇంకేముంది ఆయన 2018 జనవరి 14 నుంచి కేరళలోని శ్రీ కృష్ణుడి ఆలయంలో నిర్వహించే ఉత్సవాలకు జీవా ముఖ్య అతిథిగా రావాల్సిందిగా కోరారు. జీవా ముద్దుగా మలయాళం పాట పాడటం నిజంగా తనని ఆశ్చర్యపరిచిందని వీలుంటే ధోని తన భార్య సాక్షితో పాటు జీవాను కూడా తీసుకురావాలని ఆయన తెలిపారు.

అంతకముందు ధోనితో కలిసి ఓ లడ్డూ కోసం పోటీ పడుతున్న వీడియో కూడా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇలా ధోని కుమార్తె జీవాకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో కూడా క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. నిజం చెప్పాలంటే జీవా ఇప్పటికే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయింది.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+