అలసిన ధోనికి వాటర్ ఇచ్చిన జీవా: వీడియో వైరల్
హైదరాబాద్: ముంబైలోని అంథేరీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం బాలీవుడ్ స్టార్స్, భారత క్రికెటర్ల మధ్య మధ్య జరిగిన ఛారిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ ఆరంభంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫ్రీ కిక్‌తో గోల్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే.
విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆల్ హార్ట్స్ తరుపున ఆడిన ధోని మ్యాచ్‌ని అసాంతం ఎంజాయ్ చేశాడు. జట్టులోని సహచర క్రికెటర్లు పుట్‌బాల్ ఆడేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వేళ.. ధోని మాత్రం చలాకీగా ఆడుతూ 39వ నిమిషంలో రెండోసారి గోల్ చేసి పుట్‌బాల్‌లో తన ప్రావీణ్యాన్ని చాటుకున్నాడు.
అలసిన ధోనికి వాటర్ ఇచ్చిన జీవా
దీంతో కోహ్లీ జట్టు 2-0తో తొలి అర్ధభాగంలోనే ఆధిపత్యం దిశగా దూసుకెళ్లింది. ఇదిలా ఉంటే మ్యాచ్ విరామ సమయంలో అలసిపోయి వస్తున్న ధోనీని చూసిన చిట్టి తల్లి జీవా వాటర్ బాటిల్ తీసుకుని మైదానంలో ధోనికి ఎదురెళ్లింది. అక్కడే మోకాళ్లపై కూర్చుని జీవా చేతుల మీదుగా కొన్ని నీళ్లు తాగి.. ప్రేమతో హత్తుకున్నాడు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఈ మ్యాచ్‌లో అభిషేక్ బచ్చన్ ఆల్ స్టార్స్ జట్టుపై విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆల్ హార్ట్స్ జట్టు 7-3 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ధోని రెండు గోల్స్‌తో ఆల్ హార్ట్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
బెక్‌హామ్ తరహాలో గోల్ చేసిన ధోని
బెక్‌హామ్ తరహాలో రెండు చూడముచ్చటైన ఫ్రీ కిక్ గోల్స్ కొట్టి అభిమానులను అలరించాడు. ఆ తర్వాత 39వ నిమిషంలో లభించిన ఫ్రీ కిక్‌ను మరోసారి నెట్‌లోకి పంపిన ధోని జట్టును 2-0తో ఆధిక్యంలో నిలబెట్టాడు. ధోని చేసిన గోల్స్‌పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే మొదలైంది.

92వ నిమిషంలో కోహ్లీ గోల్
ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ కూడా రెండు గోల్స్ సాధించాడు. మరోవైపు 57వ నిమిషంలో రణ్‌బీర్ కపూర్ గోల్ చేయడంతో ఆల్ స్టార్స్ ఎట్టకేలకు రేసులోకొచ్చింది. 87వ నిమిషంలో కేదార్ జాదవ్ గోల్ కొట్టగా.. 92వ నిమిషంలో కోహ్లీ గోల్ చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత క్రికెటర్లతో పాటు టెన్నిస్ ప్లేయర్ బోపన్న, హాకీ కెప్టెన్ శ్రీజేశ్ కూడా ఆల్ హార్ట్స్ జట్టు తరఫున ఆడారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications