
డుప్లెసిస్‌ను, శార్ధూల్ ఠాకూర్‌ను హత్తుకొని
ఐపీఎల్‌లో సీఎస్‌కే ఫైనల్‌కు చేరడం ఇది ఏడోసారి. ధోనికి ఇది ఎనిమిదో ఫైనల్ మ్యాచ్. ధోనీ కెప్టెన్సీలో గతేడాది పూణె జట్టు ఫైనల్ చేరుకుంది. మ్యాచ్ విజయానంతరం ఆటగాళ్లందరూ కలిసి స్టేడియంలోకి పరుగెత్తుకొచ్చి డుప్లెసిస్‌ను, శార్ధూల్ ఠాకూర్‌ను హత్తుకొని తమ ఆనందాన్ని, ప్రేమాభిమానాలను చాటుకున్నారు. స్టేడియంలోని సీఎస్‌కే అభిమానుల ఆనందాన్ని మాత్రం మాటల్లో వర్ణించలేనిది.

ఓడినా మరో అవకాశం ఉండేదని
విజయానంతరం మాట్లాడిన ధోని.. మేం గెల్చినప్పుడు ఆనందంగా ఉండటం అనేది మామూలు విషయమేనని అన్నారు. తొలి రెండు స్థానాల్లో నిలవడం అనేది మరో అవకాశాన్ని ఇస్తుంది. ఒకవేళ మేం ఓడినా మరో అవకాశం ఉండేదని ధోని వ్యాఖ్యానించారు.

క్రీడాకారుల భార్యలందరూ
2013 ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ అనంతరం, సీఎస్‌కే జట్టులోని సభ్యులు గుజరాత్ లయన్స్‌కు, పుణె సూపర్ జెయింట్స్‌కు వెళ్లారు. రెండేళ్ల విరామం అనంతరం తిరిగి చెన్నైకే చేరుకున్నారు. తిరిగి చెన్నైలోకి వచ్చిన ఏడాదే ఫైనల్‌కు చేరడంతో వారు సంబరాల్లో మునిగిపోయారు. క్వాలిఫైయర్-1ను తిలకించేందుకు క్రీడాకారుల భార్యలందరూ వచ్చారు.

ఆరంభం నుంచి భారీ అంచనాలు
వాంఖడే స్టేడియంలో జరిగిన క్వాలిఫైయర్-1లో భావోద్వేగాలు పొంగిపొర్లాయంటే అతిశయోక్తి కాదు. చెన్నై అభిమానులతో పాటు, ఆటగాళ్లు సైతం సంబరాలు చేసుకున్నారు. రెండేళ్ల విరామం తర్వాత బరిలోకి రావడం.. కొన్ని మ్యాచ్‌లకు ముందే టాప్ 2లో కొనసాగుతుండటంతో జట్టుపై ఆరంభం నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications
