హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని... భారత క్రికెట్‌లో విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు. కెప్టెన్‌గా వన్డే వరల్డ్‌కప్, టీ20 వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలను గెలిచాడు. అలాంటి ధోని తాజాగా ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్న మిథాలీ సేనకు ఓ సలహా ఇచ్చాడు.
వరల్డ్‌కప్ ఫైనల్ తరచూ ఆడే అవకాశం రాదని, ముందు గేమ్‌ను ఎంజాయ్ చేయాలని మిథాలీ సేనకు సలహా ఇచ్చాడు. టోర్నీ అంతా అద్భుతంగా ఆడారని, మరొక్క అద్భుతమైన ఆట.. వరల్డ్‌కప్‌ను ఇస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలని ధోనీ ఈ సందర్భంగా చెప్పాడు.

సామర్థ్యానికి తగినట్లు ఆడాలని భారత జట్టుకు సూచించాడు. ఆటగాళ్ల అసాధారణ ఆటతీరే ఇండియాకు ప్రపంచ కప్పును అందిస్తుందని పేర్కొన్నాడు. అది ఒక క్యాచ్, ఒక రనౌట్ చేయడం, అత్యుత్తమ బౌలింగ్ చేయడం, ఒక మంచి ఇన్నింగ్స్ నిర్మించడం వంటివి భారత్‌కు కప్పును అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.
భారత మహిళల జట్టు ఇంగ్లాండ్‌తో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో పలువురు ఇప్పటికే మిథాలీ సేనకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న కోహ్లీ బృందం కూడా శుభాకాంక్షలు తెలిపింది. తాజాగా ధోని శుభాకాంక్షలు తెలిపిన వీడియో స్టార్ స్పోర్ట్స్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.