Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోని 300: ఆరో భారత క్రికెటర్‌, ఖాతాలో ఎన్నో రికార్డులు

హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య గురువారం నాలుగో వన్డే జరగనుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగే ఈ వన్డే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఎంతో ప్రత్యేకం. మహేంద్ర సింగ్‌ ధోనికి ఇది 300వ వన్డే మ్యాచ్‌ కావడమే.

భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా ధోని నిలవనున్నాడు. ఇప్పటి వరకు సచిన్‌ టెండూల్కర్(363), రాహుల్‌ ద్రవిడ్‌(344), మహమ్మద్‌ అజారుద్దీన్‌(334), సౌరవ్‌ గంగూలీ(311), యువరాజ్‌ సింగ్‌(302)లు మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు.

దాదాపు 12 ఏళ్ల కెరీర్‌లో వన్డేల్లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా ఎదిగి, ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న ధోని గురువారం తన వన్డే కెరీర్‌లో 300వ వన్డే మ్యాచ్‌ ఆడనున్నాడు. వన్డే క్రికెట్లో గొప్ప ఫినిషర్‌గా పేరున్న ధోని... గత రెండు మ్యాచ్‌ల్లో ఛేదనలో కీలక ఇన్నింగ్స్‌లతో భారత్‌కు విజయాన్ని అందించాడు.

రెండో వన్డేలో 45, మూడో వన్డేలో 67 పరుగులు చేసిన ధోని తనలో ఇంకా చేవ తగ్గలేదని నిరూపించుకున్నాడు. దీంతో ఈ మైలురాయి వన్డే మ్యాచ్‌లో ధోని గుర్తుండి పోయే ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. దీంతో పాటు 2019 వరల్డ్‌ కప్‌ వరకు ధోని కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం

2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం

* 2004లో సౌరవ్‌ గంగూలీ కెప్టెన్సీలో ధోని వన్డేల్లో అరంగేట్రం చేశాడు. డిసెంబరు 23న చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టిన ధోని తన తొలి మ్యాచ్‌లో పరుగులేమీ చేయలేదు.

* ఇప్పటి వరకు 299 వన్డేలాడిన ధోని 88.47 స్ట్రయిక్ రేట్‌తో 9,608 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 65 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

* వన్డేల్లో ధోని వ్యక్తిగత అత్యధిక స్కోరు 183 నాటౌట్‌. 2005 డిసెంబరు 31న శ్రీలంకతో జయపురలో జరిగిన వన్డేలో నమోదు చేశాడు.

2007లో కెప్టెన్‌గా బాధ్యతలు

2007లో కెప్టెన్‌గా బాధ్యతలు

* 2007లో రాహుల్ ద్రవిడ్ నుంచి ధోని కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. ధోని నాయకత్వంలో టీమిండియా ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించింది.

* ధోని నాయకత్వంలోనే భారత జట్టు 2007లో టీ20 ప్రపంచకప్‌, 2011లో ప్రపంచకప్‌, 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీలను గెలుచుకుంది.

* ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వన్డేలకు సారథ్యం వహించిన ఆటగాళ్ల జాబితాలో ధోనిది మూడో స్థానం. అతనికి ముందు రికీ పాంటింగ్‌(ఆస్ట్రేలియా, 230), ఫ్లెమింగ్‌(న్యూజిలాండ్‌, 218) ఉన్నారు.

కెప్టెన్‌గా ధోని

కెప్టెన్‌గా ధోని

* కెప్టెన్‌గా ధోని 199 మ్యాచ్‌ల్లో 6,633 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

* ధోని కెప్టెన్‌గా 15 మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులను అందుకున్నాడు.

* 2007-2016వరకు వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించిన ధోని భారత్‌ తరఫున అత్యధికంగా 199 వన్డేలకు నాయకత్వ బాధ్యతలు నిర్వహించాడు. ఇందులో 110 విజయాలు, 74 ఓటములు, 4 డ్రాగా ముగియగా, 11 మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడు

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడు

* భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడు. సచిన్‌ టెండూల్కర్(18,426), సౌరవ్‌ గంగూలీ(11,221), రాహుల్‌ ద్రవిడ్‌(10,889)ల తర్వాత ధోని ఉన్నాడు.

* ధోని ఇప్పటివరకు వన్డేల్లో 209 సిక్స్‌లు బాదాడు. వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాళ్లలో ధోనిది నాలుగో స్థానం.

* పాకిస్థాన్‌‌కు చెందిన షాహిద్‌ అఫ్రిది(351), లంకకు చెందిన సనత్‌ జయసూర్య(270), వెస్టిండిస్‌కు చెందిన క్రిస్‌ గేల్‌(238)లు ధోని కంటే ముందున్నారు. భారత్‌ తరఫున అత్యధిక సిక్స్‌లు బాదిన క్రికెటర్ ధోనినే. ధోని తర్వాత సచిన్‌ 195 సిక్స్‌లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

99 స్టంపింగ్స్ చేసిన ధోని

99 స్టంపింగ్స్ చేసిన ధోని

* వికెట్‌ కీపర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న ధోని ఇప్పటి వరకు 99 స్టంపింగ్స్ చేశాడు. ఇప్పటివరకు 299 వన్డేలాడిన ధోని ప్ర‌స్తుతం 99 స్టంపింగ్స్‌తో శ్రీలంక మాజీ వికెట్ కీప‌ర్ కుమార సంగ‌క్క‌ర‌తో స‌మానంగా ఉన్నాడు.

* 299 వన్డేల్లో రెండు సార్లు మాత్రమే బౌలింగ్‌ చేసిన ధోని కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. ఓ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌ని ధోని అవుట్ చేశాడు.

* టెస్టు క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన ధోని ఇప్పటి వరకు 90 టెస్టులు ఆడాడు. 77 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు.

నాటౌట్‌గా ధోని రికార్డు

నాటౌట్‌గా ధోని రికార్డు

* ధోని ఇప్పటి వరకు వన్డేల్లో 72 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. దీంతో అత్యధిక వన్డేల్లో నాటౌట్‌గా నిలిచిన ఆటగాళ్లు షాన్‌ పొలాక్‌, చమిందావాస్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరో ఇన్నింగ్స్‌తో ధోని నాటౌట్‌గా నిలిస్తే వన్డేల్లోనే అత్యధిక సార్లు నాటౌట్‌గా నిలిచిన ఆటగాడిగా ధోని ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు.

* అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్లో ధోని ఇప్పటి వరకు 121 సార్లు (వన్డేల్లో-72, టెస్టుల్లో -16, టీ20-33) నాటౌట్‌గా నిలిచాడు.

* ఇక, లక్ష్య ఛేదనలో ధోని 40 సార్లు నాటౌట్‌గా నిలిచి చరిత్ర రికార్డు సృష్టించాడు. ఆ తర్వాతి స్థానాల్లో జాంటీ రోడ్స్‌(33), ఇంజమామ్‌ ఉల్‌హాక్‌(32), రికీ పాంటింగ్‌(31)లు ఉన్నారు.

ధోని టాప్‌ 5 వన్డే ఇన్నింగ్స్‌

ధోని టాప్‌ 5 వన్డే ఇన్నింగ్స్‌

* శ్రీలంకపై 183 నాటౌట్‌ (జైపూర్‌-2005)

* పాకిస్థాన్‌పై 148 (విశాఖపట్నం-2005)

* ఆఫ్రికా ఎలెవన్‌‌పై 139 నాటౌట్‌ (చెన్నై - 2007)

* ఆస్ట్రేలియాపై 139 నాటౌట్‌ (మొహాలి - 2013)

* ఇంగ్లండ్‌పై 134 (కటక్‌-2017)

ధోని ఇప్పటివరకు అందుకున్న అవార్డుల జాబితా

ధోని ఇప్పటివరకు అందుకున్న అవార్డుల జాబితా

* 21 మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు

* 6 మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు

* 2 రెండు సార్లు (2008, 09) ఐసీసీ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డులు

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+