Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2011 ప్రపంచకప్.. ధోనీ విన్నింగ్ షాట్ బ్యాట్ వేలం.. ఎంత ధర పలికిందో తెలుసా?

MS Dhonis 2011 World Cup bat auctioned for Rs 83 lakhs for wifes charitable trust
MS Dhoni 2011 World Cup Bat Auctioned For Huge Price | Oneindia Telugu

ముంబై: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అనగానే వెంటనే గుర్తొచ్చేది టీ20 ప్రపంచకప్ (2007), వన్డే ప్రపంచకప్ (2011). టీ20, వన్డే ప్రపంచకప్‌లతో పాటు 2013లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని భారత్ గెలుచుకోవడంతో క్రికెట్ ప్రపంచంలో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ధోనీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. మూడు ప్రతిష్టాత్మక టోర్నీలు భారత్ ఖాతాలో ఉన్నాయంటే మహీ అద్భుత కెప్టెన్సీనే అందుకు కారణం. ధోనీ ఇప్పటికీ బెస్ట్ కెప్టెన్లలో ఒకడిగా ఉన్నాడు.

ధోనీ బ్యాట్‌ వేలం:

ధోనీ బ్యాట్‌ వేలం:

'సాక్షి ఫౌండేషన్‌'ని ధోనీ సతీమణి సాక్షి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పేద పిల్లల సంరక్షణ కోసం ధోనీ బ్యాట్‌ని సాక్షి ఫౌండేషన్‌ వేలానికి వేసింది. వేలంలో ధోనీ బ్యాట్‌ ఏకంగా రూ. 83 లక్షలకి అమ్ముడుపోయింది. ఆర్కే గ్లోబల్ షేర్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ గ్రూప్ అంత భారీ ధరని వెచ్చించి కొనుగోలు చేసింది. నిజానికి ఆ బ్యాట్ ధర 4 నుంచి 5 వేలు ఉండొచ్చని సమాచారం.

 91 నాటౌట్:

91 నాటౌట్:

ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన 2011 ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. మహేల జయవర్దనె (103 నాటౌట్: 88 బంతుల్లో 13x4) అజేయ సెంచరీ చేసాడు. లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా వీరేంద్ర సెహ్వాగ్ (0), సచిన్ టెండూల్కర్ (18) వికెట్లను ఆదిలోనే కోల్పోయింది. విరాట్ కోహ్లీ (35) కాసేపు నిలబడ్డాడు. గౌతమ్ గంభీర్ (97: 122 బంతుల్లో 9x4)తో కలిసి ధోనీ (91 నాటౌట్: 79 బంతుల్లో 8x4, 2x6) నాలుగో వికెట్‌కి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. గంభీర్ ఔటైనా.. యువరాజ్ సింగ్‌తో కలిసి 48.2 ఓవర్లలోనే 277/4తో మ్యాచ్‌ని ధోనీ ముగించాడు.

బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు:

బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు:

2011 ప్రపంచకప్‌‌లో ధోనీ ఎక్కువగా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసాడు. ఫైనల్లో మాత్రం ఒక స్థానం ముందుకు వచ్చాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న యువీ ఆరో స్థానంలో వచ్చాడు. దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌తో బౌలింగ్ చేయించేలా శ్రీలంక కనిపించడంతో.. స్పిన్ బాగా ఆడగల మహీ ముందుకువచ్చాడు. అప్పట్లో ఈ బ్యాటింగ్‌ మార్పుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే జట్టు ప్రయోజనాల కోసమే తన బ్యాటింగ్ ఆర్డర్‌ని మార్చుకున్నట్లు ధోనీ చాలా సార్లు వివరణ ఇచ్చాడు.

ప్రాక్టీస్‌ మొదలు:

ప్రాక్టీస్‌ మొదలు:

ధోనీ గత ఎనమిది నెలలుగా భారత జట్టుకి దూరంగా ఉంటున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో భారత్‌ ఓటమి తర్వాత ఇప్పటి వరకూ మళ్లీ టీమిండియా జెర్సీ ధరించలేదు. అయితే ఈనెల 29న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) సీజన్-13 మొదలవనుంది. ఈ సీజన్‌ ఐపీఎల్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోనీ ప్రాక్టీస్‌ మొదలెట్టాడు. సోమవారం ఎంఏ చిదంబరం స్టేడియంలో తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లో మహీ పాల్గొన్నాడు.

Story first published: Friday, March 6, 2020, 15:32 [IST]
Other articles published on Mar 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+