
రొటేషన్ పద్ధతిలో అవకాశాలు:
తాజాగా ఇషాంత్ మాట్లాడుతూ... 'ధోనీ కెప్టెన్సీలో ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువగా రొటేషన్ పద్ధతిలో అవకాశాలు వచ్చేవి. తరచూ ఫాస్ట్ బౌలర్లను మార్చుతూనే ఉండేవాడు. మహీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు జట్టులో దాదాపు ఏడుగురు బౌలర్లం ఉండేవాళ్లం. అందరు కొత్త వాళ్లు కావడం, అనుభవం లేకపోవడం, రొటేషన్ పద్ధతి కారణంగా నిలకడగా రాణించలేకపోయాం. బౌలర్ల మధ్య సమన్వయం సాధ్యం కాలేదు. రొటేషన్ విధానంతో మాకు లాభం చేకూరలేదు' అని అన్నాడు.

కోహ్లీ వచ్చాక పరిస్థితి మారింది:
'విరాట్ కోహ్లీ బాధ్యతలు తీసుకున్నాక పరిస్థితి పూర్తిగా మారింది. నిలకడగా ఆడటం ఎంతో సహాయపడింది. ప్రస్తుతం జట్టులో 3-4 పేసర్లు మాత్రమే ఉన్నాం. దీంతో మా మధ్య సమన్వయం పెరిగింది. డ్రెస్సింగ్ రూమ్‌లో మా ఆలోచనలను స్పష్టంగా పంచుకుంటున్నాం. దీంతో మా మధ్య అనుబంధం మరింత బలపడింది. మైదానంలో సమష్ఠిగా రాణిస్తున్నాం. కోహ్లీ నేతృత్వంలో ఫాస్ట్ బౌలర్లు విశేషంగా రాణించడానికి వారికి నిలకడగా అవకాశాలు రావడమే' అని ఇషాంత్ పేర్కొన్నాడు.

గిలెస్పీ సాయం చేశాడు:
'భారత్‌లో చాలా మంది ఎదుటి వ్యక్తి లోపాల్ని ఎత్తి చూపడానికి ముందుంటారు. కానీ.. దానికి పరిష్కార మార్గం ఎవరూ చెప్పరు. ఫుల్ లెంగ్త్ బాల్స్ విషయంలో పేస్ పెరగాలని ఎంతో మంది నాకు సూచించారు. కానీ.. పరిష్కార మార్గం చెప్పలేదు. కౌంటీ ఆడుతున్నప్పుడు ఆసీస్ మాజీ ఆటగాడు జాసన్ గిలెస్పీ ఈ విషయంలో నాకు సాయం చేశాడు. అతడి సూచనలతో నా సాధనలో మార్పులు చేసుకున్నా' అని ఇషాంత్ చెప్పకొచ్చాడు.

ఈ ఏడాది 25 వికెట్లు:
భారత్ తరఫున ఇషాంత్ ఇప్పటి వరకు 96 టెస్టులు, 80 వన్డేలు, 14 టీ20లు ఆడాడు. టెస్ట్ ఫార్మాట్‌లో 292 వికెట్లు, వన్డేల్లో 115, టీ20ల్లో 8 వికెట్లు సాధించాడు. ఈ ఏడాది ఆరు టెస్టులు ఆడిన లంబూ 15.56 సగటుతో 25 వికెట్లను తీసాడు. వచ్చే ఏడాది న్యూజిలాండ్‌తో భారత్‌కు టెస్టు సిరీస్ ఉంది. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఢిల్లీకి లంబూ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాంత్ ఎనిమిది వికెట్లు సాధించాడు.


Click it and Unblock the Notifications
