మొన్న కూతురుతో: నేడు రాంచీ వీధుల్లో బుల్లెట్‌పై ధోనీ చక్కర్లు
రాంచీ: భారత క్రికెట్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీకి బైకులు అంటే చాలా ఇష్టమనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి కూల్ కెప్టెన్ ధోనీ బైకు పైన వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. ఆయన సోమవారం నాడు జార్ఖండ్ రాజధాని రాంచీ వీధుల్లో బుల్లెట్ పైన తిరిగారు.
ఎంహెచ్పీ 6518 అనే నెంబర్ ఉన్న బుల్లెట్ వాహనం పైన ధోనీ రోడ్డు పైకి వచ్చారు. ఇటీవలి వరకు ప్రపంచ కప్ టోర్నమెంటుతో ధోనీ సేన బిజీగా గడిపింది. మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 8 ప్రారంభం కానుంది.

కాగా, మహేంద్ర సింగ్ ధోని తన ముద్దురు కూతురు జివాతో ఇటీవల తొలిసారి కనిపించిన విషయం తెలిసిందే. జార్ఖండ్ రాజధాని రాంచీలోని బిర్సాముండా అంతర్జాతీయ విమానాశ్రయంలో భార్య సాక్షి, కుమార్తె జివాతో ధోని కెమెరా కంటికి చిక్కాడు.
టీమిండియా బ్యాట్స్‌మెన్, ధోని సహచరుడు సురేష్ రైనా వివాహానికి హాజరై తిరిగి ఇంటికి చేరుకునే క్రమంలో బిర్సాముండా అంతర్జాతీయ విమానాశ్రయంలో ధోని మీడియాకు దొరికిపోయాడు. ధోని తన కూతురును ఎత్తుకొని ఉన్న ఫోటోను ఫేస్‌బుక్ ప్రొపైల్ ఫిక్‌గా పెట్టుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications