For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గంటలపాటు ట్రోఫీని చేతుల్లో ఉంచుకోనవసర్లేదు: ధోనీ

MS Dhoni reveals why he prefers handing over the trophy to the youngsters

హైదరాబాద్: కెప్టెన్‌గా ఎన్నో ఉత్తమ లక్షణాలుండటంతోనే ధోనీ అంతటి అభిమానం పొందగలిగాడు. ఎలాంటి ఉత్కంఠ పరిస్థితులు ఎదురైనా సరే.. జట్టును విజయానికి చేరువ చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తాడు. తన కెప్టెన్ కెరీర్‌లో ఎన్నో ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ధోనీ ట్రోఫీని జట్టుకే ఇచ్చేసేవాడు. ఇటీవల జరిగిన ఐర్లాండ్ టీ 20 సిరీస్‌లోనూ రెండో మ్యాచ్‌ తుది జట్టులో స్థానం కోల్పోయిన ధోనీ.. మిగిలిన క్రికెటర్లకు కూల్‌డ్రింక్స్ అందించాడు.

ఇటీవల జరిగిన ఇంటర్వూలో ఇలా మ్యాచ్ విజయానంతరం జట్టు అంతా కలిపి తీయించుకునే ఫొటోలో ట్రోఫీ మీ చేతుల్లో ఎందుకుండదు అని అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చాడు ధోనీ.. మ్యాచ్ గెలిచిన వెంటనే కెప్టెన్‌ను పిలిచి నిర్వహకులు ట్రోఫీని అందజేస్తారు. ఆ సమయంలో ఎలాగూ కెప్టెన్ ఎక్స్‌పోజ్ అవుతాడు. మళ్లీ ఆ ట్రోఫీని పట్టుకొచ్చి జట్టు అంతా కలిసి ఫొటో దిగుతున్నప్పుడు కూడా పట్టుకోవాలసిన అవసర్లేదు.'

'ఏ మ్యాచ్ అయినా గెలవాలంటే జట్టు అంతా కలిసి కష్టపడితేనే సాధించగలం. అలాంటిది ట్రోఫీ అంతా కెప్టెన్ చేతుల్లోనే ఉండడమనేది. అంతగా నచ్చదు. ట్రోఫీ గెలుచుకోవడం.. ఆ విజయాన్ని జట్టుతో కలిసి పంచుకోవడం ఇదే చేయాల్సింది. జట్టులోని సంబంధాలను ఎంతో సింపుల్‌గా ఉంచాలి. నాకు తెలిసి ట్రోఫీని అందుకునేంత వరకూ కెప్టెన్ దగ్గర ఉంటే సరిపోతుంది.' అని ధోనీ చెప్పుకొచ్చాడు.

అంతకుముందు మాట్లాడిన సందర్భంలో జట్టులోని ప్రతి ఆటగాడి భావాలను గౌరవించాలని, కామన్ సెన్స్‌తో వ్యవహరిస్తే అందరూ మంచి నాయుకులవుతారని చెప్పాడు. అతను కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఏం చెప్పినా.. ఈ విషయం మాకు తెలుసులే అనే సమాధానం ఎప్పుడూ వినబడలేదని తెలిపాడు.

Story first published: Tuesday, July 10, 2018, 16:41 [IST]
Other articles published on Jul 10, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+