Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni Retirement: జేబు దొంగతనం కంటే వేగంగా.. ధోనీ పనికానిచ్చేస్తాడు: రవిశాస్త్రి

MS Dhoni Retirement: Ravi Shastri said As wicketkeeper MS Dhoni was faster than any pickpocket

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అనూహ్య నిర్ణయంతో యావత్‌ క్రీడాలోకాన్ని షాక్‌కు గురిచేశాడు. ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు శనివారం రిటైర్మెంట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే రోజు టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా కూడా ఆటకు అల్విదా చెప్పాడు. ధోనీ, రైనా అనూహ్యం నిర్ణయం పట్ల క్రికెట్ అభిమానులంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. మరోవైపు అభిమానులు, ప్రముఖులు,సెలబ్రిటీలు అంతర్జాతీయ క్రికెట్‌కి వారు చేసిన సేవలపై అభినందనలు తెలుపుతూ ట్వీట్స్ పెడుతున్నారు. ఇక క్రికెటర్లంతా ఈ ఇద్దరితో తమకున్న అనుబంధాన్ని సోషల్‌ మీడియా ద్వారా వ్యక్తపరుస్తున్నారు.

జేబు దొంగతనం కంటే వేగంగా:

జేబు దొంగతనం కంటే వేగంగా:

ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై టీమిండియా చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించాడు. లెఫ్టినెంట్‌ కర్నల్‌ ధోనీకి సెల్యూట్‌ అని పేర్కొన్నాడు. ధోని అత్యుత్తమ వికెట్‌ కీపర్‌ అని కితాబిచ్చాడు. అతడి వేగాన్ని జేబు దొంగతనంతో పోల్చి చమత్కరించాడు. 'ఎంఎస్ ధోనీ ఎవరి తర్వాత కాదు. సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి దేశ క్రికెట్‌ స్వరూపాన్నే మార్చేశాడు. అతను చేసే స్టంప్‌ ఔట్‌లు, రనౌట్లు అద్భుతం. అతడి చేతులు ఎంతో చురుగ్గా కదులుతాయి. కొన్నిసార్లు జేబులు కట్‌ చేసే దొంగల కంటే వేగంగా వికెట్లను గిరాటు వేయడం మహీకే సొంతం. అతను బెయిల్స్‌ ఎగరగొట్టినట్లు బ్యాట్స్‌మన్‌ కూడా గుర్తించలేడు' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

ధోనీ ఘనతలు లెక్కకు మించి:

ధోనీ ఘనతలు లెక్కకు మించి:

'2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌, 2013 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ, టెస్టుల్లో నంబర్‌వన్‌ (2009) ఇలా ధోనీ ఘనతలు లెక్కకు మించి ఎన్నో ఉన్నాయి. ఖరగ్‌పూర్‌లో రైల్వే టికెట్‌ కలెక్టర్‌ నుంచి మొదలుపెడితే.. భారత కెప్టెన్‌గా ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం. కెరీర్‌ ఆసాంతం నిరాడంబరతను ప్రదర్శించిన ధోనీ అదే రీతిలో వీడ్కోలు పలికి ఆశ్చర్యపరిచాడు. వికెట్‌ కీపింగ్‌లో అతను అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పాడు. క్రికెట్‌లో ఏ జాబితాలో చూసినా అత్యుత్తమ ఆటగాళ్లలో మహీ ఉండి తీరాలి' అని రవిశాస్త్రి చెప్పాడు.

ఎంత కూల్‌ కెప్టెనో అంత అగ్రెసివ్‌:

ఎంత కూల్‌ కెప్టెనో అంత అగ్రెసివ్‌:

ఎంఎస్ ధోనీ బయటకు ఎంత కూల్‌గా ఉంటాడో లోపల అంత అగ్రెసివ్‌గా ఉంటాడని పాకిస్థాన్‌ హెడ్‌ కోచ్‌ మిస్బా ఉల్‌ హక్‌ అన్నాడు. మహీ భారత జట్టు ముఖచిత్రాన్నే మార్చేశాడని, తన సారథ్యంలో మూడు ఐసీసీ ట్రోఫీలు దేశానికి అందిచ్చాడని ప్రశంసించాడు. 'ధోనీ బయటకి ఎంత కూల్‌గా కనిపిస్తాడో, లోపల అంత అగ్రెసివ్‌ ప్లేయర్‌. అతడు జట్టును నడిపించిన తీరు.. బలోపేతం చేసిన ప్రక్రియ అమోఘం. అలాగే సీనియర్ల నుంచి జూనియర్ల వరకూ అందరినీ సమన్వయం చేసుకుంటూ వచ్చాడు. దాంతో మొత్తం జట్టు స్వరూపమే మారిపోయింది. గంగూలీ ఎక్కడైతే వదిలివెళ్లాడో అక్కడి నుంచే టీమిండియా క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లాడు. దాంతో అద్భుతాలు చేశాడు. అతడో గొప్ప వ్యక్తి మాత్రమే కాదు అద్భుతమైన కెప్టెన్ కూడా' అని పాక్‌ కోచ్‌ కొనియాడాడు.

ఏకైక కెప్టెన్:

ఏకైక కెప్టెన్:

దాదాపు 16 ఏళ్ళ పాటు భారత జట్టుకు ఎంఎస్ ధోనీ సేవలు అందించాడు. మూడు ఫార్మాట్లలో కూడా టీమిండియాకు ధోనీ అన్ని విధాలుగా తన బాధ్యతలు నిర్వహించి మంచి విజయాలు అందించాడు. 2007లో టీ20 ప్రపంచకప్, ఆ తర్వాత వన్డే ప్రపంచకప్‌ (2011)తో పాటు 2013లో చాంపియన్‌ ట్రోఫీని కూడా సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. మూడు ఐసీసీ టోర్నీలను గెలిచిన ఏకైక కెప్టెన్‌గా నిలిచిపోయాడు.

Story first published: Monday, August 17, 2020, 10:53 [IST]
Other articles published on Aug 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+