
అందుకే ఆగస్టు 15న:
ఎంఎస్ ధోనీ, సురేశ్ రైనా అనూహ్యం నిర్ణయం పట్ల క్రికెట్ అభిమానులంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అయితే భారత స్వాతంత్ర దినోత్సవమైన ఆగస్ట్ 15న.. అదీ 19:29 గంటలకే మహీ ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాడనే చర్చ సోషల్ మీడియాలో ఊపందుకుంది. శనివారంతో భారత్ 73 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పూర్తి చేసుకొని.. 74వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ రోజునే '7' నెంబర్ జెర్సీ గల ఎంఎస్ ధోనీ, '3' నెంబర్ జెర్సీ గల సురేష్ రైనా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనికి సురేశ్ రైనా పాయింట్.. అనే ఏమోజీతో స్పందించడం విశేషం.ఇక అభిమానులు అయితే ఈ రెండు అంశాలకు (73-7,3) పోలిక పెడుతూ.. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్‌స్టాల్లో స్టేటస్‌లతో రెచ్చిపోయారు.

19: 29నే ఎందుకు:
ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై జరుగుతున్న మరో ప్రచారం కూడా యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది. 19:29 గంటలకే మహీ ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాడనే విషయం మరో నెటిజన్ వివరించాడు. 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిన సమయం 19: 29నే అని.. ధోనీ చివరి మ్యాచ్ కూడా అదే కావడంతో రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాడని కొందరు అభిమానులు అంటున్నారు. మొత్తానికి 15 ఆగస్ట్ 19:29 సమయంకే.. ధోనీ రిటైర్మెంట్ ఎందుకు ఎంచుకున్నాడో అభిమానులకు కొంత క్లారిటీ వచ్చింది. అనుకొని చేశారో.. లేక యాదృశ్చికంగా జరిగిందో తెలియదు కానీ.. ఇది మాత్రం అభిమానులకు విపరీతంగా ఆకట్టుకుంది. అభిమానులు అయితే ఇలా పోస్టులు చేస్తున్నారు కానీ.. అందులో ఎంత వాస్తవం ఉందో మహీకే తెలియాలి.

ధోనీ టీ20 ప్రపంచకప్ ఆడాలనుకున్నాడు కానీ:
ఏడాదికి పైగా ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పటికీ.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి అతనికి పూర్తి మద్దతు ఉంది. ఐపీఎల్ 2020 తర్వాత మాజీ సారథి తిరిగి జట్టులోకి వస్తాడని హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా చెప్పాడు. ధోనీ ఎన్నిరోజులు ఆడకున్నా.. మైదానంలోకి దిగితే పరుగులు చేయగలడన్న నమ్మకం వారిది. జాతీయ జట్టులోకి వచ్చేందుకు మహీకి ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ వాయిదా పడటంతో.. ధోనీ తన ఆలోచనను మార్చుకొని అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.

న్యూజిలాండ్‌తో చివరి మ్యాచ్:
15 ఏళ్ల పాటు క్రికెట్లో కొనసాగిన ఎంఎస్ ధోనీ ఎన్నో ఘనతలు అందుకున్నాడు. ధోనీ 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో మహీ పరుగులేమీ చేయకుండా రనౌట్ అయ్యాడు. ఇక చివరిగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచులో ఆడాడు. ఇక టెస్టుల విషయానికొస్త.. 2005లో శ్రీలంకతో మహీ తొలి టెస్టు ఆడగా.. 2014లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ధోనీ 90 టెస్టుల్లో, 350 వన్డేల్లో, 98 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మరోవైపు దశాబ్దకాలం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిన సురేష్ రైనా.. 18 టెస్ట్‌లు, 226 వన్డేలు, 78 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. టెస్ట్‌ల్లో 768, వన్డేల్లో 5615, టీ20ల్లో 1605 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఏడు సెంచరీలు నమోదు చేశాడు. ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన రైనా టెస్ట్‌ల్లో 13, వన్డేల్లో 36, టీ20ల్లో 13 వికెట్లు తీశాడు.


Click it and Unblock the Notifications












