ఫోటోలు: వెంగ్ సర్కార్ విమర్శలకు ధోని కౌంటర్
హైదరాబాద్: జనవరి 15 నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే సిరిస్‌కు తన ఎంపికపై ప్రశ్నించిన ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఉపాధ్యక్షుడు దిలీప్ వెంగ్‌సర్కార్‌కు టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.
న్యూజిలాండ్‌తో వన్డే సిరిస్ ముగిసిన అనంతరం ధోని జనవరి 15న పూణెలో ఇంగ్లాండ్‌లో ప్రారంభం కానున్న వన్డే సిరిస్‌లో ధోని పాల్గొననున్నాడు. అయితే ఈ రెండున్నర నెలల వ్యవధిలో కనీసం ఒక్క రంజీ మ్యాచ్ అయినా ఆడకుండా ధోని ఫిట్‌నెస్ ఎలా కాపాడుకుంటాడంటూ వెంగ్ సర్కార్ బహిరంగంగా విమర్శించాడు.
దీనిపై ది టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ధోని మాట్లాడుతూ జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ ఫిట్‌నెస్ కాపాడుకుంటున్నానని సమాధానమిచ్చాడు. 'రాంచీలో సాధన చేస్తున్నా. జిమ్‌లోనూ కష్టపడుతున్నా. ఇంగ్లాండ్‌తో వన్డే, టీ20లకు నన్ను నేను ఫిట్‌గా ఉంచుకుంటున్నాను' అని ధోని బదులిచ్చాడు.

భారత్-ఏ జట్టుతో వార్మప్ మ్యాచ్‌లో ధోని
మరోవైపు జనవరి 10, 12న ముంబైలోని సీసీఐ మైదానంలో ఇంగ్లాండ్ జట్టు భారత్-ఏ జట్టుతో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో వన్డే సిరిస్‌కు ముందు ధోనికి మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించడం కోసం భారత్-ఏ జట్టులో ధోనికి బీసీసీఐ చోటు కల్పించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

వన్డే సిరిస్‌కు సన్నాహకంగా వార్మప్ మ్యాచ్
మూడు వన్డేల సిరిస్‌కు సన్నాహకంగా ఈ వార్మప్ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. న్యూజిలాండ్ సిరిస్ అనంతరం ధోని ఇప్పటివరకు ఎలాంటి టోర్నీల్లో ఆడలేదు. ఇంగ్లాండ్‌తో జనవరి 15న పూణెలో జరిగే తొలి వన్డేతో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అప్పటికి ధోని మ్యాచ్ ఆడకుండా 77 రోజులవుతుంది.

ప్రాక్టీస్ లేకుండా ధోని బరిలోకి దిగుతాడా?
అయితే వార్మప్ మ్యాచ్‌లు గాకుండా నేరుగా వన్డే సిరీస్‌లో బరిలోకి దిగుతాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరిస్‌కు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఆడకుండా ధోనీ పాల్గొంటే రెండు నెలలకు పైగా క్రికెట్ టోర్నీలకు దూరంగా ఉన్నట్లు అవుతుంది.

రంజీ ట్రోఫీలో జార్ఖండ్‌కు ప్రాతినిధ్యం వహించని ధోని
టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాక ధోనీ రంజీ ట్రోఫీలో జార్ఖండ్‌కు ప్రాతినిధ్యం వహించడం లేదు. విజయ్ హజారే ట్రోఫీలో మాత్రమే సొంత రాష్ర్టానికి ఆడుతున్నాడు. అయితే జార్ఖండ్ రంజీ జట్టుతో ధోని రెగ్యులర్ ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొంటూ ఫిట్‌నెస్ మెరుగు పరచుకుంటున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications