Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni: క్రికెట్ లో రాణిస్తే ప్రచారం అక్కర్లేదు.. ఎంఎస్ ధోని..!

సోషల్ మీడియాలో చాలా అరుదుగా యాక్టివ్‌గా ఉండే స్టార్లలో భారత లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ కూడా ఒకడు. ధోని 2020లో తన అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అయితే అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. తాజాగా ఇంత తక్కువ సోషల్ మీడియా ప్రొఫైల్‌ను ఎలా మెయింటెన్ చేస్తున్నాడని ఓ వ్యక్తి ధోనిని అడిగాడు. అప్పుడు ధోని చాలా నిజాయితీగా సమాధానం ఇచ్చాడు.

తనను తాను ప్రమోట్ చేసుకోవాలని తన మేనేజర్లు తనపై ఒత్తిడి తెస్తారని, అయితే తన ఆట బాగుంటే తనకు పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) అవసరం లేదని ధోని పేర్కొన్నాడు. "నేను ఎప్పుడూ సోషల్ మీడియాకు పెద్ద అభిమానిని కాదు. అంతటా నాకు వేర్వేరు మేనేజర్లు ఉన్నారు. వారందరూ పుష్ చేస్తూనే ఉన్నారు. నేను 2004లో ఆడటం ప్రారంభించాను. ప్రచారం చేసుకోవాలని మేనేజర్లు సూచించే వారు. నేను మంచి క్రికెట్ ఆడితే, నాకు పీఆర్ అవసరం లేదనే సమాధానం కూడా నా దగ్గర ఉంది" అని యూరోగ్రిప్ ట్రెడ్ టాక్స్‌లో ధోని పేర్కొన్నాడు.

MS Dhoni responds to the campaign on social media

భారత జట్టు గొప్ప కెప్టెన్లలో ఎంఎస్ ధోనీ ఒకరు. T20 ప్రపంచ కప్ (2007), ODI ప్రపంచ కప్ (2011), ఛాంపియన్స్ ట్రోఫీ (2013) మూడు ప్రధాన ICC వైట్-బాల్ టైటిళ్లను గెలుచుకున్న ఏకైక కెప్టెన్‌గా లెజెండ్ గా ధోని నిలిచాడు. ధోని భారత్ ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించాడు.
అతను చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదు ఐపిఎల్ టైటిల్‌ను సంపాదించి పెట్టాడు. 2023లో ఫ్రాంచైజీకి టైటిల్‌ని అందించిన తర్వాత ధోని CSK కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.

కెప్టెన్ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్ అప్పగించారు. అయితే జట్టు సరిగా రాణించకపోవడంతో మళ్లీ ధోనినే కెప్టెన్సీ అప్పగించారు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు 43 ఏళ్ల ధోనిని సీఎస్కే అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఉంచుకుంది. ఫ్రాంచైజీలు ఐదేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడని పక్షంలో తమ ఆటగాళ్లను అన్‌క్యాప్డ్ కేటగిరీలో ఉంచుకునేందుకు ఐపీఎల్ కొత్త నిబంధనను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే

Story first published: Wednesday, January 1, 2025, 17:30 [IST]
Other articles published on Jan 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+