Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హెలికాప్టర్ షాట్ ఆడొద్దు: పిల్లలకు ధోని హెచ్చరిక

హైదరాబాద్: తాను టీ20ల నుంచి తప్పుకోని యువ ఆటగాళ్లకు అవకాశాలివ్వాలని మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, అగార్కర్‌లు చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పందించాడు. జీవితంలో ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయని, వాటిని గౌరవించాల్సిన అవసరం ఉందని ధోని అన్నాడు.

దుబాయిలో తన అకాడమీ ప్రారంభోత్సవ సందర్భంగా ఖలీజ్ టైమ్స్‌కు ఇంటర్యూ ఇచ్చిన ఇంటర్యూలో ధోని మాట్లాడుతూ 'టీమిండియాలో భాగం కావడమే గొప్ప ప్రేరణ. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవించి జట్టులోకి వచ్చిన ఆటగాళ్లను చూశాం. కేవలం క్రికెట్‌పై తపన, అభిరుచి, ఆసక్తి ఉన్న వాళ్లకే ఇది సాధ్యమవుతుంది' అని అన్నారు.

నేనెప్పుడూ ఫలితాన్ని నమ్మను

నేనెప్పుడూ ఫలితాన్ని నమ్మను

'నేనెప్పుడూ ఫలితాన్ని నమ్మను. కేవలం నా చేతుల్లో ఉన్న ప్రక్రియను మాత్రమే నమ్ముతాను. ఫలితం గురించి ఆలోచిస్తూ అనవసరంగా ఒత్తిడికి గురికాను. ఒకసారి మ్యాచ్‌ అయిపోయాక అద్దంలో చూసుకుని, అత్యుత్తమంగా ప్రయత్నించానని నాకు నేను చెప్పుకుంటే అప్పుడు నేను ఫలితాన్ని అంగీకరించగలను' అని ధోని తెలిపాడు.

పిల్లలు హెలికాప్టర్ షాట్ ఆడొద్దు

పిల్లలు హెలికాప్టర్ షాట్ ఆడొద్దు

హెలికాప్టర్‌ షాట్‌ ఆడే క్రమంలో గాయమయ్యే అవకాశముందని, పిల్లలు ఆ షాట్‌ ఆడొద్దని ధోని కోరాడు. 'రోడ్లపై టెన్నిస్‌ బంతితో ఆడుతూ నేను నేర్చుకున్న షాట్‌ అది. అది చాలా కష్టమైంది. టెన్నిస్‌ బంతి అయితే పూర్తిగా బ్యాటు కింది భాగం తగిలినా ఎంతో దూరం వెళ్తుంది. మామూలు క్రికెట్లోనైతే బంతి.. బ్యాట్ మధ్య భాగంలో తగలాలి' అని ధోని అన్నాడు.

ఆ షాట్ ఆడాలంటే బాగా కష్టపడాలి

ఆ షాట్ ఆడాలంటే బాగా కష్టపడాలి

'కాబట్టి ఆ షాట్‌ బాగా ఆడడం రావాలంటే చాలా కష్టపడాలి. గాయపడే అవకాశం ఉన్నందున చిన్నారులు హెలికాప్టర్‌ షాట్‌ ఆడొద్దనే కోరుకుంటున్నా' అని ధోని చెప్పాడు. కెప్టెన్‌గా 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వరల్డ్ కప్‌లు గెలిచిన ధోని కివీస్‌తో రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో టీ20లో కోహ్లీతో కలిసి దూకుడుగా ఆడటంలో విఫలమయ్యాడు.

ధోని టీ20 భవిష్యత్తుపై ప్రశ్నలు

ధోని టీ20 భవిష్యత్తుపై ప్రశ్నలు

దీంతో ఈ మ్యాచ్‌లో భారత్‌ 40 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో ధోని టీ20 భవిష్యత్తుపై ప్రశ్నలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే 2014లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా టెస్టు క్రికెట్‌‌కు వీడ్కోలు పలికిన ధోని.. 2016లో పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 13:28 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+