కెప్టెన్‌గా ఒక శకం ముగిసింది: ధోని సాధించిన విజయాలివే
హైదరాబాద్: భారత జట్టుకు అత్యధిక విజయాలనందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బుధవారం (జనవరి 4)న సంచలన నిర్ణయం తీసుకున్నాడు. విజయవంతమైన కెప్టెన్‌గా టీమిండియాను పదేళ్ల పాటు నడిపించిన ధోని పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. అయితే జనవరి 15 నుంచి ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే, టీ20 సిరిస్‌కు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ధోని సమాచారం అందించాడని బీసీసీఐ ట్వీట్ చేసింది.
అయితే ఆటగాడిగా మాత్రం కొనసాగుతానని చెప్పినట్టు తెలిపింది. అంతేకాదు ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే, టీ20 సిరిస్‌కు ధోని వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా అందుబాటులో ఉండనున్నాడు. కెప్టెన్సీకి ధోని గుడ్ బై చెప్పడంతో కోహ్లీనే అన్ని ఫార్మాట్లకు కెప్టెన్సీ వహించనున్నట్లు బీసీసీఐ ట్విట్టర్‌లో పేర్కొంది.
ధోని హయాంలో భారత జట్టు అత్యున్నత శిఖరాలను అధిరోహించింది. వన్డే ప్రపంచ కప్.. ఛాంపియన్స్ ట్రోఫీ.. టీ20 ప్రపంచ కప్‌లు ఇలా మూడూ సాధించిన ఏకైక కెప్టెన్‌గా ధోని చరిత్రలో నిలిచిపోయాడు. మూడు ఫార్మాట్లలో 50కి పైగా మ్యాచ్‌ల్లో జట్టుకు నాయకత్వం వహించిన ఒకే ఒక్క కెప్టెన్ ధోని మాత్రమే.

331 మ్యాచ్‌ల్లో జట్టుకు కెప్టెన్‌గా
టెస్టులు.. వన్డేలు.. టీ20ల్లో కలిపి అత్యధికంగా 331 మ్యాచ్‌ల్లో జట్టుకు కెప్టెన్‌గా ఉన్న క్రికెటర్ కావడం విశేషం. ఇలా ధోని సాధించిన విజయాలు భారత క్రికెట్ చరిత్రలో చిరకాలం గుర్తుండిపోతాయి. వికెట్ కీపర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న ధోని 2007లో ద్రావిడ్ నుంచి సారథ్య బాధ్యతలు స్వీకరించాడు.

ధోని సారథ్యంలో 2009లో టెస్టుల్లో టాప్ ర్యాంకు
ఆ తర్వాత జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. 2007లో ఐసీసీ వరల్డ్ టీ20, 2011లో వన్డే వరల్డ్‌కప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీలను ధోని నేతృత్వంలో టీమిండియా సాధించింది. ధోని హయాంలో 2009లో టెస్టుల్లో టాప్ ర్యాంకును భారత జట్టు కైవసం చేసుకుంది.

199 వన్డేలు ఆడితే 110 మ్యాచ్‌ల్లో విజయం
ధోనీ నాయకత్వంలో భారత 199 వన్డేలు ఆడితే 110 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 72 టీ 20ల్లో 41 నెగ్గగా 28 మ్యాచ్‌ల్లో ఓడింది. కెప్టెన్‌గా వన్డేల్లో 54 సగటుతో 6,633 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా టీ20ల్లో 122.60 యావరేజితో 1,112 పరుగులు సాధించాడు. కెప్టెన్‌గా ధోని టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది.

283 వన్డేలాడిన ధోని 9110 పరుగులు చేశాడు
తన కెరీర్‌లో 283 వన్డేలాడిన ధోని.. 9110 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 61 అర్ధసెంచరీలు ఉన్నాయి. 73 టీ20 మ్యాచ్‌లు ఆడిన ధోని 1112 పరుగులు సాధించాడు. వికెట్ కీపర్‌గా వన్డేల్లో 267 క్యాచ్‌లు, 92 స్టంపింగ్‌లు, టీ20ల్లో 41 క్యాచ్‌లు, 22 స్టంపింగ్‌లు ధోని ఖాతాలో ఉన్నాయి.

ధోని కెప్టెన్సీలో 2011లో వన్డే వరల్డ్ కప్
2011లో ధోని కెప్టెన్సీలో భారత్ వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో సిక్స్‌తో విజయాన్ని అందించిన ధోని 78 బంతుల్లో 91 పరుగులతో అజేయంగా నిలిచి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ వన్డే ప్రపంచకప్ నెగ్గిన అనంతరం ధోని సారథ్యంలోనే వరల్డ్ కప్‌ను గెలుచుకుంది.

2015 ప్రపంచకప్, 2016 టీ20 ప్రపంచకప్
ధోని నేతృత్వంలోని టీమిండియా 2015 ప్రపంచకప్, 2016 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరింది. 2005, ఏప్రిల్‌లో పాకిస్థాన్‌తో విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో 148 పరుగులు సాధించడం ద్వారా తొలిసారి తానెంటో ప్రపంచానికి చాటిచెప్పిన ధోనీ అనంతరం ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతను నేతృత్వం వహించిన చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు రెండు సార్లు టైటిల్ గెలుచుకుంది.

రెండుసార్లు ఛాంపియన్స్ లీగ్ టీ20
రెండుసార్లు ఛాంపియన్స్ లీగ్ టీ20 కప్‌ను కూడా గెలుచుకుంది. ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును రెండు సార్లు గెలుచుకున్న వ్యక్తిగా ధోని రికార్డు సృష్టించారు. భారత ప్రభుత్వం 2007లో రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డు, 2009లో పద్మశ్రీ పురస్కారంతో ధోనిని సత్కరించింది. లెఫ్టినెంట్ కల్నల్ హోదాతో భారత ఆర్మీ ధోనీని గౌరవించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications