IPL 2025 Dhoni: వేటకు వేళైంది సామీ.. చెన్నైలో అడుగుపెట్టిన 'CSK' సింహం
ఐపీఎల్ 2025 కోసం ధోనీ సన్నద్ధమయ్యాడు. తాజాగా అతడు సీఎస్కే హోం టౌన్ చెన్నైకు చేరుకున్నాడు. దీంతో అతడికి చెన్నై విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. దీనికి సంబంధించిన ఫొటోలను చెన్నై సూపర్ కింగ్స్ తన అధికార సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో మహీ బ్లాక్ అండ్ బ్లాక్ ధరించి, కళ్లజోడు పెట్టుకుని ఎంతో కూల్ గా వాకింగ్ చేస్తూ కనిపించాడు. చుట్టూ పోలీస్ బందోబస్త్ ఉండగా మధ్యలో ఒక్కడే ఎంతో కూల్ నడుస్తూ కనిపించాడు.
రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి..
చెన్నై సూపర్ కింగ్స్ త్వరలోనే ట్రైనింగ్ క్యాంప్ ను ప్రారంభించనుంది. ఈ ట్రైనింగ్ క్యాంపులో పాల్గొనేందుకు తాజాగా మహీ చెన్నైకు చేరుకున్నాడు. అక్కడ మహీతో పాటు మరికొంతమంది ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ చేయనున్నరు. ఇక చెన్నైకు వెళ్లిన మహీని సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రిసీవ్ చేసుకున్నాడు. ఇద్దరు కౌగలించుకుని, కాసేపు ముచ్చటించుకున్నారు.

తొలి మ్యాచ్ ఎవరితో అంటే..
ఈ ఐపీఎల్ సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. సీఎస్కే తన తొలి మ్యాచ్‌ను మార్చి 23న చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్ తో తలపడనుంది. రుతురాగ్ గైక్వాడ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే సీఎస్కే ధోనీ సారథ్యంలో ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈ సారి కూడా ఎలాగైనా యంగ్ కెప్టెన్ సారథ్యంలో టైటిల్ ను సాధించుకోవాలని పట్టుదలతో ఉంది. కాగా, ఈ సీజన్ కోసం ధోనీ ప్రత్యేకంగా తక్కువ బరువున్న బ్యాన్లను తయారుచేయించుకున్నాడు.
MS DHONI MEETS RUTURAJ GAIKWAD IN CHENNAI. ❤️pic.twitter.com/wo6cghIGPM
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 26, 2025
MS DHONI HAS ARRIVED IN CHENNAI. 🦁 pic.twitter.com/uq7UjxoD9a
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 26, 2025
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications