Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni : బయటకొచ్చిన ధోనీ రేర్ వీడియో.. ఏం చేస్తున్నాడో చూడండి!

టీమిండియా లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన ప్రతి మ్యాచ్‌కు ఎంత మంది ఫ్యాన్స్ హాజరయ్యారో చూస్తేనే ధోనీ ఫాలోయింగ్ అర్థం అవుతుంది. ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీ ముద్దాడిన ఈ లెజెండరీ కెప్టెన్.. ఇటీవలే మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. అనంతరం ఇంటికి చేరుకున్నాడు

భారత జట్టు కూడా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓడిన తర్వాత కొంత గ్యాప్ దొరకడంతో అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ధోనీకి సంబంధించిన పాత వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ధోనీ తన బైక్‌పై చెన్నైలో షికారు చేస్తూ కనిపించాడు. అతని వెనుక అప్పటి యంగ్ పేసర్ శ్రీశాంత్ కూర్చొని ఉన్నాడు. ఇది షేర్ చేస్తున్న ఫ్యాన్స్ అప్పటి జ్ఞాపకాలను నెట్టింట పంచుకుంటున్నారు.

MS Dhoni rare unseel video goes viral as he enjoys his time with friends

ధోనీకి బైక్స్ అంటే ఎంత పిచ్చి అనేది చాలా సార్లు తనే స్వయంగా చెప్పాడు. రాంచీలో ధోనీ ఇంట్లో ఎన్నో రకాల బైక్స్ ఉంటాయి. సమయం దొరికినప్పుడల్లా బైక్స్‌పై షికార్లకు వెళ్లడం ధోనీకి అలవాటు. అదే ఇంకా యంగ్‌లో ఉన్నప్పుడైతే అతని జోష్ మరో రేంజ్‌లో ఉండేది. ఎప్పుడు ఖాళీ దొరికినా బైక్‌పై షికార్లు చేసేవాడు. ఇదే విషయాన్ని ఫ్యాన్స్ కూడా గుర్తుచేసుకుంటున్నారు.

కాగా ప్రస్తుతం రాంచీలో టైం ఎంజాయ్ చేస్తున్న ధోనీ.. తన ఫ్రెండ్స్‌తో సమయం గడుపుతున్నాడు. ముంబైలోకి కోకిలాబెన్ ఆస్పత్రిలో ధోనీ మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. అనంతరం రాంచీ చేరుకున్న అతను.. తన స్నేహితులతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. తెల్లగడ్డం పెంచుకొని, పూల చొక్కా వేసుకొని కనిపిస్తున్నాడు.

ఇలా తన ఫ్రెండ్స్‌తో ధోనీ కొత్త లుక్‌లో కనిపిస్తున్న ఫొటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ధోనీ.. ఫ్యాన్స్ కోసం వచ్చే ఏడాది కూడా ఐపీఎల్ ఆడతానని చెప్పిన సంగతి తెలిసిందే. మళ్లీ అప్పుడే ధోనీ మైదానంలో కనిపిస్తాడు.

Story first published: Friday, June 16, 2023, 13:27 [IST]
Other articles published on Jun 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+