Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2nd ODI: ధోని మెరుపు స్టంపింగ్, అవాక్కైన రాస్ టేలర్ (వీడియో)

India vs New Zealand 2nd ODI : MS Dhoni,Quick As A Flash,Stumps Ross Taylor | Oneindia Telugu
MS Dhoni, quick as a flash, stumps Ross Taylor. Awestruck fans cant keep calm

హైదరాబాద్: మౌంట్ మాంగనూయ్‌లోని బే ఓవ‌ల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి తన మెరుపు స్టంపింగ్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆతిథ్య జట్టుకు 325 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే.

అనంతరం ఇన్నింగ్స్‌ 18వ ఓవర్ వేసిన కేదార్ జాదవ్ బౌలింగ్‌లో న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాస్‌ టేలర్ బంతిని డిఫెన్స్ చేస్తూ కొద్దిగా ముందుకు కాలు కదిపాడు. బ్యాట్‌కి అందని బంతి నేరుగా ధోని చేతుల్లోకి వెళ్లిపోగా.. స్టంపౌట్ ప్రమాదాన్ని పసిగట్టిన రాస్‌ టేలర్ వేగంగా క్రీజులో పాదం ఉంచేందుకు ప్రయత్నించాడు.

క్షణాల వ్యవధిలోనే వికెట్లను గీరాటేసిన ధోని

అయితే, అప్పటికే బంతిని అందుకున్న ధోనీ.. క్షణాల వ్యవధిలోనే వికెట్లను గీరాటేశాడు. ఔట్ కోసం ధోనీ అప్పీల్ చేయగా.. బ్యాట్స్‌మెన్ క్రీజు వదిలి ఎక్కువ దూరం వెళ్లకపోవడం‌తో ఫీల్డ్ అంపైర్‌... థర్డ్ అంపైర్‌కి నివేదించాడు. రిప్లైని పరిశీలించిన థర్డ్ అంపైర్‌ ధోనీ బెయిల్స్‌ను పడగొట్టిన సమయంలో రాస్ టేలర్ పాదం గాల్లో ఉన్నట్లు తేలడంతో ఔట్‌గా ప్రకటించాడు.

థర్డ్ అంపైర్‌కి నివేదించిన ఫీల్డ్ అంఫైర్

తొలుత ధోని అప్పీల్ చేసినప్పుడు ఫీల్డ్ అంపైర్‌ తొలుత నాటౌట్ అని తల అడ్డంగా ఊపాడు. అయితే, ఆ తర్వాత థర్డ్ అంపైర్‌కి నివేదించడంతో ఆఖరి క్షణం వరకూ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. అయితే, చివరకు పాదం గాల్లో ఉండటం.. థర్డ్ అంఫైర్ ఔట్‌గా ప్రకటించడంతో నిరాశగా పెవిలియన్‌కు చేరాడు.

ఓటమి దిశగా న్యూజిలాండ్

ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు ఓటమి దిశగా పయనిస్తోంది. 37 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. న్యూజిలాండ్ విజయానికి 113 పరుగులు చేయాల్సి ఉంది.

1
44081
Story first published: Saturday, January 26, 2019, 14:39 [IST]
Other articles published on Jan 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+