ఫోటోలు: ధోని, సింధు, గోపీచంద్‌లకు పద్మ అవార్డులు
హైదరాబాద్: అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్‌లను ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డులు వరించనున్నాయి. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంతకుముందు రోజు పద్మ పురస్కారాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
2009లో పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన మహేంద్ర సింగ్ ధోనికి ఈసారి పద్మభూషణ్ దక్కే అవకాశాలు ఉన్నాయి. జనవరి 3వ తేదీన పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న ధోని ప్రస్తుతం జట్టులో ఆటగాడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భారత్ జట్టుకు 27 టెస్టు విజయాలనందంచి మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ధోనీ నిలిచాడు.

ఏకైక కెప్టెన్‌గా ధోని చరిత్ర
అంతేకాదు భారత జట్టుకు వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా మూడింటిని అందించిన ఏకైక కెప్టెన్‌గా ధోని చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరిస్‌లో భాగంగా కటక్‌లో జరిగిన రెండో వన్డేలో మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

రెండో ఆటగాడిగా ధోని రికార్డు
స్వదేశంలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ధోని రికార్డు సృష్టించాడు. స్వదేశంలో నాలుగువేల పరుగుల మైలురాయిని ధోని అందుకున్నాడు. తద్వారా భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ధోనీ నిలిచాడు. 110 వన్డేలతో ధోని ఈ ఘనతను సాధించాడు. ఇదిలా ఉంటే స్వదేశంలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో 6,976పరుగులతో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు.

సింధుతో పాటు కోచ్ గోపీచంద్ పేరు
గతేడాది రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పిన సింధును 2015లో పద్మశ్రీ అవార్డు వరించింది. అయితే ఈసారి సింధుకి పద్మ భూషణ్ దక్కవచ్చు. కోచ్ గోపీచంద్ పేరును కూడా పద్మ అవార్డు కోసం ఎంపిక చేసినట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది.

సాక్షి మాలిక్ పేరు కూడా
అయితే ఇప్పటికే అర్జున, ద్రోణాచార్య, పద్మ భూషణ్ అందుకున్న గోపీకి ఈసారి పద్మ విభూషణ్ దక్కించుకునే అవకాశాలున్నాయి. క్రీడారంగం నుంచి ఒలింపిక్ మెడలిస్ట్, స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ పేరును కూడా పద్మ అవార్డుకి ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications