
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ తనకు లభించిన విశ్రాంతి సమయాన్ని ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య సాక్షి, కుమార్తె జీవాతో వీలైనంత ఎక్కువ సమయాన్ని ఇంట్లోనే గడుపుతున్నాడు. తాజాగా ధోని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోని అభిమానులతో పంచుకున్నాడు.
ఈ వీడియోలో ధోని తన పెంపుడు శునకాలైన జోయ(డచ్ షెపర్డ్), లిలీ(హుస్కీ)లకు శిక్షణ ఇస్తున్నాడు. గతంలో కూడా ధోని తన పెంపుడు శునకాలకు బంతిని క్యాచ్ పట్టడంలోనూ శిక్షణ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
ఇదిలా ఉంటే టెస్టు క్రికెట్‌కు ధోని వీడ్కోలు పలకడంతో ప్రస్తుతం స్వదేశంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. కాగా, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు నవంబర్ 15 (గురువారం) ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభం కానుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.