Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రూట్ మార్చిన ధోని: 'విజయ్ హాజరే ట్రోఫీలో ఆడతా'

మొహాలి: వచ్చే ఏడాది జరగనున్న విజయ్ హాజరే ట్రోఫీలో టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆడేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాడు. వన్డే టోర్నీగా భావించే ఈ టోర్నమెంట్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2015 డిసెంబరులో బెంగుళూరులో జరిగిన ఈ టోర్నీలో ధోని జార్ఖండ్ తరుపున ఆడాడు. 8 ఏళ్ల గ్యాప్ తర్వాత తన సొంత రాష్ట్రమైన జార్ఖండ్‌కు ధోని ఆడటం విశేషం. ప్రస్తుతం ధోని న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌లో బిజీగా ఉన్నాడు.

మ్యాచ్ అనంతరం ధోని మీడియాతో మాట్లాడాడు. టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్తులో మరిన్ని వన్డేలు ఆడనున్నట్లు ధోని పేర్కొన్నాడు. మూడో వన్డేలో ధోని నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన సత్తా చాటేందుకే బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చినట్టు తెలిపాడు.

MS Dhoni to play for Jharkhand in Vijay Hazare Trophy

నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు కారణం ఇదీ: కోహ్లీకి ధోని ప్రశంస

'నేనేంటో చెప్పడానికే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాను. సత్తా చాటాను. నాలుగు స్థానంలో బ్యాటింగ్ దిగితే తప్పనిసరిగా పెద్ద షాట్లు ఆడాలి. నేనేంటో నిరూపించుకోవడానికి ఈ స్థానమే సరైంది. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌కు దిగడం వల్ల ఎక్కువసేపు ఆడడటానికి అవకాశం ఉండట్లేదు. అందుకే బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చాను. ఎక్కువసేపు క్రీజ్‌లో ఉంటే బాగా ఆడతాననే నమ్మకం ఉంది' అని ధోని తెలిపాడు.

అనంతరం విజయ్ హాజరే ట్రోఫీలో కూడా పాల్గొంటానని ధోని పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరిస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌తో రెండు లేదా మూడు ట్వంటీ20లు ఆడాల్సి ఉందని చెప్పాడు. మొత్తంగా చూస్తే రాబోయే రోజుల్లో భారత జట్టు సాధ్యమైనన్ని మ్యాచ్‌లు ఆడుతుందని తెలిపాడు.

ధోని రికార్డులకు ట్విట్టర్ దాసోహం: ఎవరేమన్నారు

విజయ్ హాజరే ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 25, 2017న జార్ఖండ్.. కర్ణాటక జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. ఇదిలా ఉంటే మొహాలిలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 7 వికెట్లు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో ధోనీ 80 పరుగుల వద్ద ఔటవ్వగా, కోహ్లీ 154 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ముందజంలో ఉంది. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో వన్డే బుధవారం రాంచీలో జరగనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+