ఆర్టికల్ 370 రద్దు ఎఫెక్ట్: జమ్ము కశ్మీర్‌లో ధోని క్రికెట్ అకాడమీ

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జమ్మూ కశ్మీర్‌లో క్రికెట్ అకాడమీని ప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ అకాడమీ ద్వారా అక్కడి యువకులకు ఉచితంగా శిక్షణ ఇచ్చిందుకు... ధోని తన ప్రణాళికల గురించి త్వరలో క్రీడా మంత్రిత్వ శాఖతో మాట్లాడాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

భారత ఆర్మీలో ధోని
ప్రస్తుతం ధోని భారత ఆర్మీలో దక్షిణ కాశ్మీర్‌లో ఉన్న 106 టిఎ బెటాలియన్ (పారా)లో విధులు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. భారత ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని కశ్మీర్‌లో పారామిలటరీ విభాగంలో విధులు నిర్వర్తిస్తూ.. మరోవైపు విరామ సమయంలో తోటి సైనికులతో చాలా చక్కగా కలిసిపోతున్నాడు.

స్వాతంత్య్ర దినోత్సవం రోజున
ప్రస్తుతం పుల్వామా జిల్లా క్రూ ప్రాంతంలో పారా రెజిమెంట్ యూనిట్‌లో ధోనీ విధులు నిర్వర్తిస్తున్నాడు. తన విధుల్లో భాగంగా ధోనీ ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజు లద్దాక్‌లోని లేహ్‌లో భారత జాతీయ జెండాను ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. రెండు నెలలు పాటు క్రికెట్ నుంచి ధోని విరామం తీసుకున్న సంగతి తెలిసిందే.

జులై 31 నుంచి ఆగస్టు 15 వరకు
ఈ నేపథ్యంలో జులై 31 నుంచి ఆగస్టు 15 వరకు ధోని ఆర్మీకి తన సేవలు అందించేందుకు బీసీసీఐ సైతం అనుమతిచ్చింది. దీంతో ధోని ప్రస్తుతం ఆర్మీకి తన సేవలను అందిస్తున్నాడు. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవలే రద్దు చేసి.. జమ్ముకశ్మీర్, లడఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించింది.

ప్రతి గ్రామంలో జాతీయ జెండాను
జమ్ము కశ్మీర్‌లోని ప్రతి గ్రామంలో జాతీయ జెండాను ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ధోనీ లడఖ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తుండడం విశేషం. ఇందులో భాగంగా శనివారం ధోని లేహ్ నుంచి లడఖ్‌కు బయల్దేరాడు. అయితే, లడఖ్‌లో ధోని జెండా ఎగురువేసే వేదికను మాత్రం ఇంకా బహిర్గతం చేయలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications